Sreenath Bhasi Arrested: విశ్వక్ సేన్ లాగే ఎఫ్-వర్డ్ వాడిన మలయాళ హీరో అరెస్ట్!

Malayalam Hero Sreenath Bhasi Arrested for Using F Word: మలయాళ సినీ నటుడు శ్రీనాథ్ భాసి అరెస్ట్ అయ్యాడు. శ్రీనాథ్ భాసీని కేరళ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ​ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 28, 2022, 11:42 AM IST
 Sreenath Bhasi Arrested: విశ్వక్ సేన్ లాగే ఎఫ్-వర్డ్ వాడిన మలయాళ హీరో అరెస్ట్!

Malayalam Hero Sreenath Bhasi Arrested for Using F Word: మలయాళ సినీ నటుడు శ్రీనాథ్ భాసి ఒక మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తిన విషయంలో అరెస్ట్ అయ్యాడు. శ్రీనాథ్ భాసీని కేరళ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మలయాళంలో కుంబలంగి నైట్స్. భీష్మ పర్వం, ట్రాన్స్, కప్పేల వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీనాథ్ చట్టంబి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడు.

శ్రీనాథ్ యాంకర్‌ను దుర్భాషలాడాడని, దీంతో మహిళా యాంకర్ శ్రీనాథ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు శ్రీనాథ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసు ప్రకారం, ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో తనను యాంకర్ ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగిందని భావించిన శ్రీనాథ్ భాసి మహిళా యాంకర్‌ను దుర్భాషలాడాడు, అంతేకాక ఆంగ్లంలో 'ఎఫ్-వర్డ్' ఉపయోగించాడని తెలుస్తోంది.

అంతేకాదు ఆ ఇంటర్వ్యూ రికార్డు చేస్తున్న యూట్యూబ్ ఛానల్ సిబ్బందితో కూడా అనుచితంగా ప్రవర్తించారని తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలన్నింటినీ నటుడు ఖండించారు. మలయాళ సినిమాల్లోని నటీనటులకు వారి రౌడీ స్టైల్ ప్రకారం ఎన్ని మార్కులు వేస్తారని శ్రీనాథ్ ను మహిళా యాంకర్ అడగడంతో ఇదంతా జరిగిందని, ఈ ప్రశ్నకు కోపం వచ్చి కెమెరా స్విచాఫ్‌ చేయమని అడిగానని అంటున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి  మహిళా జర్నలిస్టు యాంకర్ శ్రీనాథ్‌పై మారాడు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.

ఈ కేసులో వీడియో ఇంటర్వ్యూకి సంబంధించిన రా ఫుటేజీతో పాటు అక్కడ అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై పోలీసులు ఫిర్యాదు నమోదు చేయడంతో శ్రీనాథ్ ను విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలిచారు.  పోలీసు స్టేషన్‌కు వచ్చాక విచారణ జరిపి అతన్ని అరెస్టు చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ వీడియో బయటపడిన తర్వాత, శ్రీనాథ్ భాసీకి చెందిన పాత వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియోలో ఓ రేడియో ఛానెల్‌లో ఇంటర్వ్యూ సందర్భంగా ఆర్జేని దుర్భాషలాడుతూ దుర్భాషలాడుతున్నాడు.

శ్రీనాథ్ భాసి సంగీత నేపథ్యం నుండి తన కెరీర్‌ను చేసాడు. మలయాళ చిత్రాల్లో నటించక ముందు సంగీత రంగంలో ఉన్నారు. ఇప్పటి వరకు మలయాళ చిత్రాల్లోనే సైడ్ రోల్స్ చేస్తూ వస్తున్న ఆయనకు హీరోగా చట్టంబి అతని మొదటి చిత్రం. ఇక అరెస్టయిన కొన్ని గంటల తర్వాత సోమవారం సాయంత్రం స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ముందు ఈ విషయంలో తన తప్పే లేదని వాదించిన శ్రీనాధ్ తరువాత క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఇక కొన్నాళ్ల క్రితం తెలుగు హీరో విష్వక్ సేన్ కూడా ఒక ప్రముఖ ఛానల్ లో ఎఫ్-వర్డ్ ను ఉపయోగించడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 

Also Read:  Mahesh Babu Mother Indira Devi: పద్మాలయ స్టూడియోస్ కు ఇందిరా దేవి పార్ధివ దేహం.. అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడంటే?

Also Read: Indira Devi Unseen Photos: మీరెన్నడూ చూడని మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఫోటోలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News