మిథున్ చక్రవర్తి తనయుడితో మదాలస శర్మ పెళ్లి ?

మహాక్షయ్ చక్రవర్తితో మదాలస శర్మకు పెళ్లి

Last Updated : Jun 7, 2018, 03:00 PM IST
మిథున్ చక్రవర్తి తనయుడితో మదాలస శర్మ పెళ్లి ?

2009లో అల్లరి నరేష్ నటించిన ఫిట్టింగ్ మాస్టర్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన మదాలస శర్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. మదాలసను వరించనున్న వరుడు ఎవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి తనయుడు మహాక్షయ్. బాలీవుడ్‌లో నటుడిగా రాణించేందుకు సరైన అవకాశాలు వెతుక్కుంటున్న మహాక్షయ్ మిథున్, మదాలస శర్మ గత రెండేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఏర్పడటంతో త్వరలోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు కాబోతున్నారు. వీళ్లిద్దరి పెళ్లికి జులై 7వ తేదీన ముహూర్తం ఖరారైనట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది. 

టాలీవుడ్‌లో నటిగా రాణించాలని చేసిన ప్రయత్నాలు ఏవీ కలిసి రాకపోవడంతో అప్పుడప్పుడు పంజాబీ, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసుకుంటున్న మదాలస శర్మ ఈ పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించే ప్రయత్నం చేస్తుందో లేక ఇంటికే పరిమితం అవుతుందో మరి!

Trending News