MAA Elections 2021 : విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లపై మంచు మనోజ్‌ సెటైర్

Manchu manoj funny comments on Manchu vishnu: మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మాత్రం ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో చాలా కూల్‌గా ఉన్నారు. ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగారు. భుజాలపై చేతులు వేసుకుని మాట్లాడారు. తన అన్న మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లపై ఫన్నీగా కామెంట్ చేశారు మంచు మనోజ్.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2021, 06:31 PM IST
  • మా ఎన్నికల వరకే వివాదాలు
  • తర్వాత మేమంతా అంతా ఒక్కటేనని చాటిచెబుతోన్న రెండు వర్గాలు
  • సెల్ఫీలు దిగిన మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్
  • సెల్ఫీపై సరదాగా కామెంట్‌ చేసిన మంచు మనోజ్
MAA Elections 2021 : విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లపై మంచు మనోజ్‌ సెటైర్

MAA Elections 2021 polling manchu manoj funny comments on his brother manchu vishnu and prakash raj selfie: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ఈసారి ఎంతో రసవత్తరంగా సాగాయి. పోలింగ్‌ కేంద్రంలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్‌ మధ్య తలెత్తిన పలు వివాదాలను మోహన్‌బాబు (mohan babu) సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నం చేశారు. ప్రకాశ్‌రాజ్‌ని (prakash raj) ఆలింగనం చేసుకున్నారు. ఎన్నికల వరకే ఈ వివాదాలంటూ మేమంతా అంతా ఒక్కటేనని చాటిచెప్పారు. 

మాదంతా ఒకే కుటుంబం.. మేమంతా కళాకారులం.. ఇలాంటి మాటలు, సమస్యలు మాకేమీ కొత్తకాదంటూ మా ఎన్నికల సందర్భంగా పలువురు నటులు కూడా చెప్పారు. మా ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు విష్ణు వర్గం (vishnu panel), మరోవైపు ప్రకాశ్ రాజ్ వర్గం (prakash raj panel) విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నాయి. ఎన్నికల రోజు కూడా రెండు వర్గాల మధ్య చాలా వివాదస్పద విషయాలు చోటుచేసుకున్నాయి. 

Also Read : SS Rajamouli Birthday: రాజ‌మౌళి బ‌ర్త్ డే.. ఆర్ఆర్ఆర్ ఆన్‌లొకేష‌న్ స్టిల్స్‌తో విషెస్‌ తెలిపిన తారక్, చరణ్

ప్రకాశ్ రాజ్‌తో మంచు విష్ణు సెల్ఫీ

అయితే మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మాత్రం ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో చాలా కూల్‌గా ఉన్నారు. ఇద్దరూ కలిసి సెల్ఫీలు (selfies) దిగారు. భుజాలపై చేతులు వేసుకుని మాట్లాడారు. ప్రకాశ్ రాజ్‌తో మంచు విష్ణు సెల్ఫీ తీసుకున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తామంతా ఒక్కటే అన్నట్లు మంచు విష్ణు చెప్పకనే చెప్పకనే చెప్పారు. 

వాటమ్మా, వాటీజ్ దిస్ అమ్మా

ఇక ప్రకాశ్ రాజ్, విష్ణు ఫోటోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అలాగే మోహన్ బాబు మరో కుమారుడు మంచు మనోజ్ కూడా ఈ ఫోటోపై తన స్పందన తెలిపారు. తన అన్న మంచు విష్ణు (manchu vishnu), ప్రకాశ్‌రాజ్‌ల సెల్ఫీని షేర్ చేస్తూ ఫన్నీగా కామెంట్ చేశారు. వాటమ్మా, వాటీజ్ దిస్ అమ్మా.. సరదాగా వ్యాఖ్యానించారు మనోజ్. మంచు మనోజ్ (manchu manoj) పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మా ఎన్నికల (Maa Elections) లో మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లలో ఎవరు గెలుస్తారన్నది మరికాసేపట్లో తేలనుంది.

 

Also Read : MAA Elections 2021: ముగిసిన మా ఎన్నికలు, ఓటు వేయని స్టార్ హీరోలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News