Lavanya Tripathi: వరుణ్‌ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య.. అబ్బో భర్తపై ఎంతో ప్రేమో..!

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ వేదమంత్రాల సాక్షిగా ఈ మధ్యనే హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరికి నిన్న మొన్నటి వరకు…సెలబ్రెటీస్.. సాధారణ ప్రేక్షకులు అందరూ విషెస్ తెలుపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఒక పోస్ట్ వేసింది కాగా ఈ పోస్టులో వరుణ్ గురించి ఆకాశానికి ఎత్తడం అందరిని ఆకర్షించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2023, 09:31 AM IST
Lavanya Tripathi: వరుణ్‌ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య.. అబ్బో భర్తపై ఎంతో ప్రేమో..!

Lavanya Tripathi: గత కొద్ది రోజుల నుంచి లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఏమి చేసినా అది పెద్ద వార్తగా నిలుస్తోంది. ఈమధ్య పెళ్లి బంధంతో ఒకటైన ఈ మెగాకపుల్.. తమ పెళ్లి వీడియోలతో‌. ఫోటోలతో ప్రేక్షకులను తెగ అలరించారు.
ఇటలీలో దాదాపు ఐదు రోజుల వేదుకగా జరిగిన వీరిద్దరి పెళ్లి కి మెగా ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ అటెండ్ అయ్యి .. అత్యంత సంబరమైన వేడుకగా జరిపారు.

మిస్టర్ సినిమాతో ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు వరుణ్ తేజ్.. లావణ్య. ఆ తరువాత అంతరిక్షం 120 km phసినిమాలో కూడా కలిసి నటించారు. కాగా దాదాపు ఏడేళ్ల వీరి ప్రేమ.. ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

ఇక పెళ్లి తర్వాత హైదరాబాద్ లో సెలబ్రిటీస్ కోసం ఘనంగా రిసెప్షన్ కార్యక్రమం కూడా జరిపారు. నిన్న మొన్నటి వరకు దీపావళీ వేడుకలతో బిజీగా ఉన్న లావణ్య.. తాజాగా తన ఇన్ స్టా వేదికగా భర్త వరుణ్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. పెళ్లయిన తర్వాత వరుణ్ గురించి.. చెబుతూ లావణ్య వేసిన ఫస్ట్ పోస్ట్ ఇది. అందుకే ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ తో పాటు .. తన పెళ్లి వేడుకలోని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోస్ షేర్ చేసింది.

తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ..’నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన, కేరింగ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు నా భర్త!.. నేను తన గురించి చెప్పడానికి ఇంకా చాలా ఉంది, కానీ వాటన్నింటిని ప్రస్తుతానికి మనసులోనే దాచుకుంటాను. ..మా కుటుంబాలు, ప్రియమైనవారి మధ్య మా మూడు రోజుల పెళ్లి ఘనంగా జరిగింది. మా కల నెరవేరింది. ఆ రోజును చాలా ప్రత్యేకంగా చేసిన ప్రతి ఒక్కరికీ, మాకు శుభాకాంక్షలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అంటూ రాసుకొచ్చింది.

ఇక లావణ్య పోస్ట్‏కు రిప్లై ఇస్తూ లవ్ ఎమోజీని షేర్ చేశాడు వరుణ్. ప్రస్తుతం లావణ్య పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. వీరిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. అంతేకాకుండా లావణ్య ఈ పోస్టుతో పాటు షేర్ చేసిన వీరిద్దరి పెళ్లి ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News