Trisha: త్రిష ఇష్యూపై ఇన్-డైరెక్ట్ గా స్పందించిన విశాల్.. ఏమన్నారంటే..!

Trisha and AV Raju Issue: త్రిష.. తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ కి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇటీవల ఈ బ్యూటీ పై మన్సూర్ వ్యాఖ్యల కారణంగా ఎటువంటి రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఏకంగా ఒక పొలిటీషియన్ ఆమెపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో త్రిష గురించి వచ్చిన కామెంట్స్ పై స్పందిస్తూ ఆమెకు అండగా నిలిచాడు హీరో విశాల్.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2024, 07:12 AM IST
Trisha: త్రిష ఇష్యూపై ఇన్-డైరెక్ట్ గా స్పందించిన విశాల్.. ఏమన్నారంటే..!

Vishal on Trisha Issue: పేరుకు తమిళ్ హీరోయిన్ అయినప్పటికీ త్రిష కు తెలుగులో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ సీనియర్ హీరోయిన్ మళ్లీ రీసెంట్ గా వరుస సినిమాలతో బిజీ అవుతుంది. లేటెస్ట్ గా ఆమె నటించిన లియో మూవీలో కో-స్టార్..మన్సూర్ అలీ ఖాన్.. త్రిషతో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి అంటూ అనుకున్నాను అని చేసిన వ్యాఖ్యలు ఎటువంటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలుసు. త్రిషకు సపోర్టుగా సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు కూడా నిలబడి తమ మద్దతు తెలిపారు. ఆ గొడవ పూర్తయిపోయింది అనుకునే సమయానికి తిరిగి త్రిష మీద మరొక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈసారి ఆమె మీద వ్యాఖ్యలు చేసింది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఒక ఎమ్మెల్యే గతంలో త్రిషకు పాతిక లక్షలు డబ్బులు ఇచ్చి మరి రిసార్ట్ కు తీసుకువచ్చాడు అంటూ తమిళ రాజకీయాల్లో ఫేమస్ అయిన వ్యక్తి ఏవీ రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతను అన్నటువంటి ఈ అసభ్యకరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతను చేసిన ఈ కామెంట్స్ పై కోలీవుడ్ లో తీవ్ర దుమారం రేగడంతో పాటు పలువురు సినీ ప్రముఖులు అతనిపై మండిపడుతున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా ఒక నటిపై అసభ్యంగా మాట్లాడడం తగదని నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తన గురించి ఏపీ రాజు చేసిన కామెంట్స్ పై సీరియస్ అయిన త్రిష ఘాటుగా స్పందించింది. కొంతమంది ఫేమస్ అవడం కోసం ఎంత నీచమైన పని చేయడానికి అయినా దిగజారి పోతారు అని ఆమె మండిపడింది. అంతేకాదు పదేపదే ఇలాంటి నీచమైన మనుషులను చూడడం చాలా అసభ్యంగా ఉందని పేర్కొంది. తనపై చేసిన ఈ కామెంట్స్ గురించి న్యాయపరంగా చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు త్రిష హెచ్చరించింది. ఈ నేపథ్యంలో త్రిష గురించి వచ్చిన కామెంట్స్ పై స్పందిస్తూ ఆమెకు అండగా నిలిచాడు హీరో విశాల్.

విశాల్ తన ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ లో ఆ పొలిటీషియన్ పేరు ఎత్తకుండానే ఇన్ డైరెక్ట్ గా..తన స్టైల్లో బాగా బుద్ధి చెప్పాడు. ‘ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి ఒక తెలివి తక్కువ మూర్ఖుడు..  సినీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి గురించి అసహ్యంగా మాట్లాడాడు అని నేను విన్నాను. ఇవన్నీ మీరు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అని నాకు తెలుసు. కానీ నేను మీ పేరు.. లేక మీరు ఏ వ్యక్తినైతే టార్గెట్ చేశారో ఆ వ్యక్తి పేరు ప్రస్తావించాలి అనుకోవడం లేదు. మీరు చేసిన ఈ చండాలమైన పని కనీసం ప్రస్తావించదగినది కూడా కాదు అని నా అభిప్రాయం. నిజంగా ఇలాంటి వారిని ఖండించాలి అన్న ఉద్దేశం కూడా నాకు లేదు. మీలాంటి రాక్షసులు నరకంలో కుళ్ళిపోవాలి అని నేను ఆశిస్తున్నాను..’అంటూ విశాల్ పెట్టిన ఓ సుదీర్ఘమైన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన

Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News