Karthika Deepam 2: దీపను చూస్తే చిరాకు పడుతున్న కార్తీక్‌.. బోరున ఏడ్చిన పారు, శ్రీధర్‌ శాపనార్థాలు..

Karthika Deepam 2 Today January 20th Episode: కార్తీక్‌ బాబు ఎక్కడ? దీని పూర్తిగా వదిలేశాడు అని అల్మరాను చూస్తుంది దీప. అప్పుడే అల్మరాలో డబ్బు చూస్తుంది దీప. ఇంత డబ్బు బీరువాలోకి ఎందుకు వచ్చింది అంటుంది. ఈ డబ్బు ఎక్కడికి కార్తీక్‌ బాబు అంటుంది. అవి మనవే దీప అంటాడు.

Written by - Renuka Godugu | Last Updated : Jan 20, 2025, 10:13 AM IST
Karthika Deepam 2: దీపను చూస్తే చిరాకు పడుతున్న కార్తీక్‌.. బోరున ఏడ్చిన పారు, శ్రీధర్‌ శాపనార్థాలు..

Karthika Deepam 2 Today January 20th Episode: రెస్టారెంట్‌ పెడదాం అంటే అది అనుకున్నంత సులువు కాదు అన్నారు. ఈ రూ.5 లక్షలతో ఎలా పెడతారు కార్తీక బాబు అంటుంది దీప. జీవితం అన్నిసార్లు మనకు నచ్చినట్లు ఉండదు కదా దీప అంటాడు. మీరు అబద్దం చెబుతున్నారు కార్తీక్‌ బాబు ఈ డబ్బు ఎక్కడ తీసుకున్నారు అంటుంది. ఫ్రెండ్ ఇచ్చాడు అంటాడు కార్తీక్‌. నమ్మను బాబు అంటుంది. మీరు ప్రతి విషయం మీ అమ్మగారికి చెబుతారు ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటుంది దీప. ఏంటి దీప నేను ఏమైనా చిన్నపిల్లవాడినా అన్ని చెప్పాలా? చెప్పాను కదా రెస్టారెంట్‌ కోసమే అని అరుస్తాడు. అప్పుడే కాంచన వస్తుంది ఏంట్రా అంత గట్టిగా అరుస్తావు అంటుంది. ఏం లేదు అమ్మ దాసు మావయ్య ఈమధ్య మనింటికి వచ్చాడా? అంటాడు. ఏమైంది రా అంటుది. మావయ్య కనిపించడం లేదు అంటాడు. అన్నయ్య ఎప్పుడూ ఇంతే ఉన్నట్టుండి కనిపించకుండా పోతాడు మళ్లీ వస్తాడు అంటుంది కాంచన

దీప శౌర్యను తీసుకుని గుడికి వెళ్లి వస్తాం అంటుంది. సరే జాగ్రత్తగా వెళ్లి రండి అంటాడు. మళ్లీ పదేపదే దీప అడగడానికి ప్రయత్నించినా కార్తీక్‌ దాటవేస్తాడు. తలనొప్పిగా ఉంది అంటాడు. సారీ దీప అని మనస్సులో అనుకుంటాడు. నా కారణంగా ఇప్పటికే నువ్వు అనుభవిస్తున్న కష్టాలు చాలు. చూశావా? పరిస్థితులు ఎలా వచ్చాయో ఒక పక్క మావయ్య కనిపించడంలేదు. శౌర్య పరిస్థితి బాగులేదు అనుకుంటాడు.

మరోవైపు అద్దంలో చూస్తూ శ్రీధర్‌ తనను తాను పొగుటుకుంటాడు. అందం చూస్తూ మురిసిపోతాడు. అప్పడే భార్య వస్తుంది. గుమ్మడి కాయ తీసుకువస్తా మీసాలపై నిలబెట్టండి అంటుంది. పదండి అంటుంది ఎక్కడికి అంటే ఇప్పుడే స్వప్నకు ఫోన్‌ చేశా నిన్నటి నుంచి దాసు కనిపించడంలేదంట అంటుంది. దాసుగాడంటే స్కూలు వెళ్లే నాలుగేల్ల పిల్లవాడు కాదు వాడో గాలోడు అంటాడు శ్రీధర్. ఎంతసేపు ఇతరులను అర్థం చేసుకోవా అంటుంది కావేరి. నేను ఎవర్నీ అర్థం చేసుకోను కిచెన్‌లోకి వెళ్లి నాకు కాఫీ తీసుకురా అంటాడు. నన్ను బాధ పెట్టిన వారంతా ఏడుస్తూనే ఉంటారు నా కాళ్ల మీద పడి తప్పైంది అనేవరకు ఏడుస్తూనే ఉంటాడు అని శపిస్తాడు. 

కంప్లైంట్‌ ఇచ్చాం ఓకే కానీ, ఇప్పటి వరకు మావయ్య ఫోన్‌ చేయలేదు అంటుంది స్వప్న కాశితో.. కాఫీ తెస్తుంది దీప. లోపల కూర్చోమంటే బయట కూర్చున్నారు అంటుంది. మావయ్య గురించి చాలా టెన్షన్‌గా ఉంది అంటుంది. పెద్దమ్మవాళ్లు శౌర్యను తీసుకుని గుడికి వెళ్లారు కదా కంగారుగా ఉంది మనం కూడా వెళ్దామా అంటుంది. బాబాయికి ఏం కాదు లే కంగారు పడకు అంటుంది దీప. పెద్దమ్మ కూడా అలాగే అంది అంటాడు కాశి. నువ్వే నాలా మాట్లాడుతున్నావ్‌ అంటుంది. రెండు రోజుల నుంచి కార్తీక్‌ బాబు పరిస్థితి అదోలా ఉంది. కంగారు పడతారు, అడిగితే చిరాకు పడతారు అవన్నీ కోపాలు కాదు నా మాట దాటేయడానికి కార్తీక్‌ బాబు చేస్తున్న పనులు నాకు అంతా అర్థం అవుతుంది. నిన్నే రాత్రి ఏమో శౌర్య ను ఫ్రెండ్ ఇంటి దగ్గర వదులుదాం అంటాడు. విచిత్రంగా శౌర్య కూడా ఒప్పుకుంది. ఈరోజు అడిగితే శౌర్యను నేను తీసుకువెళ్తా అంటాడు. మనిషి పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు అవేంటో తెలియడం లేదు. నువ్వు మీ బావతో స్నేహంగా ఉంటావు. ఆ డబ్బుల గురించి నీకు ఏమైనా తెలుసా? అంటుంది దీప.

ఇదీ చదవండి: టైటానిక్ ఒడ్డుకు చేరింది.. పవిత్రతో రిలేషన్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేసిన నరేష్‌..  

కార్తీక్‌ వారిని పక్క నుంచి గమనిస్తూ ఉంటాడు. అప్పుడే కాశికి కాల్‌ వస్తుంది. బావ మనం పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చాం కదా కాల్‌ వచ్చింది అంటాడు. కానిస్టేబుల్‌ మీ నాన్న పీహెచ్‌లో ఉన్నాడు అంటాడు. వెంటనే కంగారు పడుతూ కాశీ, కార్తీక్‌లు వెళతారు. జ్యోత్స్న.. అని పిలుస్తుంది పారు. నా కొడుకు దొరికాడంటా అంటుంది ఎక్కడున్నాడు అత్తయ్య అంటుంది సుమిత్ర. ఏ లోబీపీతో పడిపోతే ఎవరో అడ్మిట్‌ చేశారు అంటాడు శివన్నారాయణ. ఏంటి జ్యోత్స్న దాసు దొరికాడు అనగానే చేతిలో కాఫీ కప్పు పడిపోయేలా కంగారు పడిపోయావు అంటాడు. డాడీ కాఫీ కప్పు గురించి కాదు ఇంకా దేనికో అయి ఉండచ్చు అంటుంది జో. గ్రానీ నేను నీతో వస్తా అంటుంది జో. వద్దని చెప్పా కదా ఇంటి దగ్గరే ఉండు అంటాడు దశరథ. అయినా కానీ జో, పారుతోపాటు వెళ్తుంది. ఇక సుమిత్ర కూడా దాసుకు ఏమై ఉండొచ్చు అంటుంది. ఏం కాదులే అంటాడు దశరథ.

ఇదీ చదవండి: ఎయిర్టెల్.. బిఎస్ఎన్ఎల్.. ఈ సిమ్ కార్డులు రీఛార్జ్ చేయకున్నా ఎన్ని రోజులు యాక్టీవ్‌గా ఉంటాయి?

ఇక కాశి దాసును ప్రేమతో చూస్తూ ఉంటాడు. మా మావయ్యకు ఏమైంది అంటాడు. ఎవరో రోడ్డుపై పడపోయాడు అని అడ్మిట్‌ చేశాడు. ఏవరైనా బలంగా కొట్టడం లేదా యాక్సిడెంట్‌ వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అంటాడు డాక్టర్‌. ట్రీట్మెంట్‌ చేస్తే స్పృహలోకి వస్తున్నారు కానీ స్పృహ కోల్పోతున్నారు అంటాడు. ఇంటికి తీసుకు వెళ్లొచ్చు అంటాడు. సరే అంటారు. థ్యాంక్యూ డాక్టర్‌ అంటాడు కార్తీక్‌. నాదేం లేదు తీసుకుని వచ్చి చేర్పించిన వాళ్లది గొప్ప మనసు అంటాడు. ఇంటికి తీసుకువెళతారు. పారు బోరున ఏడుస్తుంది. ఎవడ్రా నిన్ను కొట్టింది వాళ్ల చేతులు కాళ్లు విరిగిపోను, పోయే కాలం రాను అని తిడుతుంది. అప్పుడు జ్యోత్స్న నువ్వు ఇలా తిడితే బాబాయికి నయం అవుతుందా? అంటుంది జో. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News