Karthika Deepam 2 Today December 18th Episode: జ్యోత్స్న తప్పేముంది అంటుంది. కార్తీక్‌ను ఆపేది ఉండే అంటుంది సుమిత్ర. వాడుపోతే ఇంకోడు దొరకడా అంటుంది పారిజాతం. దొరకడు అంటాడు దశరథ్. కార్తీక్ లేకపోతే మనం లేమా? నువ్వు నేను వాడిని నమ్ముకునే బిజినెస్ చేస్తున్నామా? ఈరోజు తలపొగరుతో వెళ్లిపోయి ఉండొచ్చు కానీ, శివన్నారాయణను ఢికొట్టలేడు. ఇది గుర్తుంచుకో అంటాడు పెద్దాయ. నా మనవరాలు ఉంది నాకు అది చాలు. రెండు రోజులు ఆగు వాడే తప్పు అయిందని వస్తాడు అంటాడు. దీంతో సంతోషంలో మునిగిపోతుంది పారిజాతం. ఇన్నాళ్లకు నేను అనుకున్నది జరిగింది. పాపం దీప అక్కడ ఏడుస్తు ఉంటుంది అని పొంగిపోతుంది. మరోవైపు కార్తీక్ జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటు ఉంటాడు. అప్పుడే కాఫీ తెస్తుంది దీప. నేను అడగలేదు కదా అంటాడు. జరిగింది మీ అమ్మగారికి చెప్పుకోలేక మీరు బరువును మొస్తున్నారు. అందుకే వేడి వేడిగా కాఫీ తీసుకువచ్చా అంటుంది. నాతోపాటు నువ్వు మోస్తున్నావ్ కదా తాగు అని సగం కాఫీ ఇస్తాడు. ఇన్ని రోజులు పాప ఆనందం కోసం ఏదైనా చేయాలి అనిపించేది. ఇప్పుడు మీకోసం చేయాలనిపిస్తుంది బాబు. ఆఫీసులో ఏం జరిగిందో ముందు మీ అమ్మగారికి చెప్పండి అంటుంది.
అప్పుడే కాంచన వస్తుంది. నాకు చెప్పు లేకపోతే తాతను అడుగుతా అంటుంది. ఆ కుటుంబానికి ఈ కుటుంబం ఎంత దూరం అయిందో నీకు తెలుస్తుంది అమ్మ. నన్ను అవమానించారు. జరిగినవన్ని మనసులో పెట్టుకుని నా నోరుతే నేనే రిజైన్ చేసేలా చేశాడు. వెంటనే పొమ్మాడు. అందుకే రిజైన్ చేశా. అన్ని వదిలేశా. ఆ కంపెనీకి నీ కొడుకుకు ఏ సంబంధంలేదు. ఇప్పుడు ఎదురుపడితే ఎవరు నువ్వు నిన్ను ఎక్కడో చూశా అంటాడు అంటుంది. బోరున విలపిస్తుంది కాంచన. ఒక్కగానొక్క కొడుకు వీడికి నా పుట్టింటినే అత్తారిల్లు చేద్దామనుకున్నా అంటుంది.
నా కొడుకు సంతోషంగా ఉంటే చాలు అనుకున్నా ఏంటి మేం చేసిన పాపం. అందరూ ఉండి కూడా మా నాన్న ఎవరు లేకుండా చేయాలి అని ఏడుస్తుంది. వాళ్ల మాట విని నచ్చినట్లు చేస్తే మంచిది అంటారు అంటాడు. ఆస్తిలో వాట తీసుకోలేదు. మళ్లీ బిజినెస్‌లోనే పెట్టమన్నా అంటుంది. దీప కూడా మళ్లీ సుమిత్రమ్మతో మాట్లాడదాం అంటుంది. నీ భర్తను అవమానించిన వారి దగ్గరికే వెళ్దామంటావ్ అని అంటాడు కార్తీక్. ఆఫీసులో నాకే కాదు ఈవిడకు కూడా సన్మానం జరిగింది. సముద్రంలా అన్ని తనలో కలిపేసుకుంటుంది అంటాడు.
ఇంక అంతా అయిపోయింది అమ్మ.. మనం ఎక్కడ తెగిపోతుందో అని పట్టుకుంటే మీ నాన్న కత్తితో నరికేశాడు అంటాడు కార్తీక్.. ఇప్పుడు ఏం చేస్తావు అంటుంది తల్లి. నాకు కంపెనీకి సంబంధంలేదు అంటాడు. కాలం అయితే ఆగిపోదు కదా.. కలలు కూడా అంతే మళ్లి కొత్తగా మొదలవుతాయి. మైండ్‌కు కాస్త రెస్ట్ కావాలి. ఏదో ఒకటి చేద్దాం. ఒకటి గుర్తు పెట్టుకో స్కూలుకు వెళ్లినప్పుడు నాకు అఆలు కూడా రావు ఇప్పుడు పీజీ చేశా. ఇది ముగింపు కాదు ఆరంభం అని చెప్పి వెళ్తాడు కార్తీక్.
ఏమే నీ భర్త జీవితంలో గెలవలేడనుకున్నావా? అంటుంది మేనత్త. ఏదో ఉపదేశాలు చేస్తుంది దీప. మనిషికి ఆస్తుల, అంతస్థుల ఏవి ముఖ్యం అని అడుగుతుంది. ఇది నేను సమాధానం వెతుకుతున్న ప్రశ్న జవాబు కాలమే చెప్పాలి అంటుంది దీప. ఇప్పుడు దీని బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటుంది. కాంచన కూడా అదే చెబుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో అని ఏడుస్తుంది.
ఇదీ చదవండి: కోట్లు కొల్లగొట్టబోతున్న రాహుల్.. ముసలోడు నిండా ముంచేశాడు, వన్ ఉమెన్ ఆర్మీ అంటున్న కావ్య...
మరోవైపు శ్రీధర్‌కు అసలు విషయం చెబుతుంది కావేరి. ఇది కదా కిక్కిచ్చే గుడ్‌న్యూస్ అంటాడు. గెంటేశారు నాకు పిల్లనిచ్చిన మామ. నాలాంటి మంచివాడిని అవమానిస్తే ఇలాగే జరుగుతుంది అంటాడు.. కార్తీక్ నీకొడుకు అండి అంటుంది కావేరి. నాకు మాత్రం కశ్మీర్‌లో షర్ట్‌లేకుండా హాయిగా తిరుగుతున్నట్లు ఉంది అంటాడు. స్వీట్ తీసుకురా అంటాడు. కావేరి పచ్చిమిర్చి తెచ్చి నేనే తినిపిస్తా కళ్లు మూసుకోండి అంటుంది. ఇవి కావేరి స్వీట్స్ అంటూ నోట్లో పెడుతుంది. ఒసేయ్.. రాక్షసి స్వీట్ ఇస్తానని మంట పెడతావా? అని తిడతాడు శ్రీధర్. అక్క కుటుంబానికి మనం ఏదైనా చేయాలి అంటుంది. నీకు ఎందుకు ఈ సరదా? కావాలంటే రెండు మిరపకాయలు తింటా కానీ, వాళ్లకు మాత్రం సహాయం చేయను అని వెళ్లిపోతాడు. వాళ్లు అడక్కపోయిన నేను మాత్రం ఏదో రూపంలో సహాయం చేస్తా అంటుంది కావేరి.
ఇక కార్తీక్ వద్దకు చెల్లి, బావమరిది, దాసులు వచ్చి పరామర్శిస్తారు. ఇలా చేస్తాడు అనుకోలేదు అంటాడు. మా అన్నయ్య లేకపోతే జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఉండేవా అంటుంది చెల్లి . ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తర్వాత ఏం చేయాలి? అని మరి కొత్త కథ ఈరోజుతో మొదలు పెట్టండి. మీరు ఏం చేసినా మేమంతా నీకు అండగా ఉంటాం. ఓ నిర్ణయం తీసుకోండి దీప. అన్నయ్య నేను ఒక మాట చెబుతా కాశీ నేను అనుకున్నాం ఇప్పుడు సిచువేషన్ చూస్తే మీరు పెట్టేకంటేమీరే ఏదో ఒక రెస్టారెంట్ పెడితే బాగుంటది అనిపిస్తుంది అంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.