కళ్యాణ వైభోగం: 30 జులై, 2018 ఎపిసోడ్‌లో ఫ్యూచర్‌ని భయంకరంగా చూపించిన మంగ

మీ అభిమాన ZEE తెలుగులో మీరు అభిమానించే కళ్యాణ వైభోగం సీరియల్ 30 జులై ఎపిసోడ్

Last Updated : Jul 31, 2018, 05:35 PM IST
కళ్యాణ వైభోగం: 30 జులై, 2018 ఎపిసోడ్‌లో ఫ్యూచర్‌ని భయంకరంగా చూపించిన మంగ

మీ అభిమాన ZEE తెలుగులో మీరు అభిమానించే కళ్యాణ వైభోగం ఎపిసోడ్‌లో సరదాగా నవ్విస్తూ, హాయిగా నడిచిన ఎపిసోడ్ ఇది. శోభనం సంగతి తర్వాత, ముందు ఫ్యూచర్ ఎలా వుంటుందో తెలుసా అనేసరికి, జై భవిష్యత్‌లోకి వెళ్తాడు. పేదరికంతో మగ్గినట్టు, అచ్చు జై, మంగలాగే ఇద్దరు పిల్లలు పుట్టినట్టు ఊహించుకుంటాడు జై. ఓవైపు చారి అడ్డుపడుతున్నా కూడా అతడి మాటల్ని పట్టించుకోకుండా ఆ పేదరికానికి, ఆ దరిద్రానికి జై మాత్రమే కారణం అని అందరూ నిందించడం చూసి జై గుండెపోటుతో కింద పడిపోతాడు. 

 

ఇదంతా ఊహించుకుని చెమటలు పట్టిన జై, దేవీపురానికి వెళ్లి లెక్కలు చూసుకునేందుకు మంగతో కలిసి రావడానికి అంగీకరిస్తాడు. అలా మంగ దేవీపురానికి వెళ్లడానికి మార్గం సుగమం చేసుకున్న టైమ్‌లో అక్కడ, నిత్య, స్వరూపతో వీళ్లు దేవీపురానికి వెళ్తున్నారని చెబుతుంది. అనంతరం స్వరూప ఎలాగైనా వాళ్లను ఆపుతానని, దానికి తగ్గట్టుగా ప్లాన్ వేస్తానని అంటుంది. మంగ కచ్చితంగా ఆ శాపం గురించి తెలుసుకోవడానికే వెళ్తుందని నిత్య, స్వరూప అనుకుంటారు. మరి మంగ దేవీపురం వెళ్లగలిగిందా? ఈ మాటలు అన్నీ విని షాక్ అయిన మంగ... ఎలాగైనా దేవీపురం వెళ్లి అసలు విషయం కనుక్కోవాలని, శాపం ఏంటో, దాని వెనుక ఉన్న కథేంటో తెలుసుకోవాలని ప్లాన్ చేయడాన్ని ఈ ఎపిసోడ్‌లో చూడవచ్చు. ఈ సీరియల్ ఎపిసోడ్స్‌ని ZEE5 ఎపిసోడ్‌లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Trending News