NTR Awards: లెజెండరీ నటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి.. పేరు మీద ప్రతి ఏడాది.. కళా వేదిక వారు సినీ ఇండస్ట్రీ కి సంబంధించి అన్ని విభాగాల్లోనూ మంచి పని తీరు కనబరిచిన వారిని సత్కరిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే ఎన్టీఆర్ అవార్డ్స్.. వేడుకను నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో కళావేదిక బృందం తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయను (సీతక్క).. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సీతక్క కూడా ఈ వేడుకలో పాలుపంచుకోవడానికి… అంగీకరించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. రామారావు అభిమానులు కూడా విచ్చేయనున్నారు.
పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి.. పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో… మంచి పేరు తెచ్చుకున్న సినీ నటి నటులకు ఈ ఏడాది కూడా కళావేదిక వారు.. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ తో సత్కరించనున్నారు. జూన్ 29 న హైదరాబాద్ లోని.. హోటల్ దసపల్లాలో.. ఈ అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల.. సమక్షంలో జరుగును.
కళావేదిక R.V.రమణ మూర్తి గారు, రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రావాలన్న.. తమ ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించినందుకు సీతక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
అంతే కాకుండా ఈ నెల 29 న సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు, NTR అభిమానులు కూడా భారీగా పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విన్నవించుకున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు.. తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ గారి పేరు మీద అవార్డులు ఇచ్చి, టాలెంట్ ఉన్న వారిని.. ఎంకరేజ్ చేస్తున్నందుకు గాను చంద్రబాబు నాయుడు కళావేదిక వారిని అభినందించారు. ఈ కార్యక్రమం గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ఇక ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సెలబ్రిటీలు రాబోతున్నారు.. అని కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా ఈసారి ఎన్టీఆర్ అవార్డును అందుకోబోతున్న విజేతలు.. ఎవరో కూడా తెలుసుకోవాలని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో
Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి