Jayam Ravi Divorce: భార్యకు విడాకులు ప్రకటించిన పొన్నియన్ సెల్వన్ హీరో జయం రవి..

Jayam Ravi Divorce: సినిమా ఇండస్ట్రీలో పెళ్లీళ్లు ఎంత వేగంగా జరుగుతాయో అంత వేగంగా విడాకులు కూడా జరగుతుంటాయి. సినీ ఇండస్ట్రీలో ఈ పోకడ ఇంకాస్త ఎక్కువ. తాజాగా తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 9, 2024, 03:42 PM IST
Jayam Ravi Divorce: భార్యకు విడాకులు ప్రకటించిన పొన్నియన్ సెల్వన్ హీరో జయం రవి..

Jayam Ravi Divorce: సినిమా ఇండస్ట్రీలో బంధాలన్ని నీటి మూటలే అని చెప్పాలి. అలా అని అందరు విడాకులతో విడిపోతారని కాదు. కొంత మంది నటీనటులు తమ జీవిత భాగస్వామితో జీవితాంతం గడుపుతున్నారు. అయితే విడాకులు అనేవి మిగతా రంగాల్లో ఉన్నా.. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి జనాల ఫోకస్ ఎక్కువగా వీళ్లపై ఉంటుంది. వాళ్లు తుమ్మినా.. దగ్గినా..ఏమి చేసినా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా తమిళంలో స్టార్ హీరోగా రాణిస్తున్న తెలుగు వాడైన   జయం రవి .. తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించి వార్తల్లో నిలిచారు.

సమంత, నాగ చైతన్య మాదిరే గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరు విడిపోతున్నట్టు తమిళ మీడియాలో ఒకటే వార్తలు. చైతూ, సామ్ విడాకులు ముందు ఏ రకంగా ప్రవర్తించారో వీళ్లిద్దరు కూడా అదే రకంగా ప్రవర్తించారు. తీరా ఈ రోజు చావు కబురు చల్లగా అన్నట్టుగా మేమిద్దరం విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

జయం రవి భార్య సెలబ్రిటీ భార్య హోదాలో ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్లిద్దరు 15 యేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. జయం రవి విషయానికొస్తే.. బాల నటుడిగా వాళ్ల నాన్న ఎడిటర్ మోహన్ నిర్మించిన ‘పల్నాటి పౌరుషం, బావ బావమరిది’ సినిమాల్లో నటించాడు. అటు తెలుగులో హిట్టైన జయం మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. అప్పటి నుంచి జయం రవిగా పాపులర్ అయ్యాడు. అంతేకాదు పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ కోలీవుడ్ స్టార్ హీరోగా సత్తా చూపెడుతున్నారు. ఇక మణిరత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో టైటిల్ రోల్లో అదరగొట్టాడు. ఈ సినిమా తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ తమిళ చిత్రంగా అవార్డును గెలుచుకుంది.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News