Jagapathi Babu: రజినీకాంత్ ఏం మాట్లాడినా పర్ఫెక్ట్.. వైసీపీ వివాదంపై జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Jagapathi Babu about Rajinikant Comments: ఇటీవల రజనీకాంత్ చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన క్రమంలో ఈ అంశం మీద జగపతి బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : May 3, 2023, 03:59 PM IST
Jagapathi Babu: రజినీకాంత్ ఏం మాట్లాడినా పర్ఫెక్ట్.. వైసీపీ వివాదంపై జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Jagapathi Babu about Rajinikanth vs YSR Congress Controversy: గత కొద్దిరోజులుగా రజినీకాంత్ అనే పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్ఠీఆర్ తజయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమానికి కమిటీ ఆహ్వానం మేరకు సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. అయితే రజినీకాంత్ హాజరై ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకోవడం మాత్రమే కాదు ఎన్టీఆర్ అల్లుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ప్రశంసల వర్షం కురిపించారు.

చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ అని పేర్కొన్న రజనీకాంత్ ఎవరినీ విమర్శలు చేయకుండానే చంద్రబాబు విజనరీ కాబట్టి ఆయనని గెలిపించాల్సిన బాధ్యత ఉంది అనే విధంగా మాట్లాడారు. అయితే ఈ విషయాన్ని అధికార వైసీపీ చాలా సీరియస్ గా తీసుకుంది, వైసీపీ ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ రజనీకాంత్ ఏమీ అనకపోయినా ఆ పార్టీకి చెందిన కీలక నేతలు మంత్రులు, కొందరు రజనీకాంత్ ని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు వెన్నుపోటుదారుడు ఆయన వెన్నుపోటు పొడిచినప్పుడు వైస్రాయ్ హోటల్ లో కూడా రజనీకాంత్ ఉన్నారు అంటూ అప్పటి విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే రజనీ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరో మీద జరుగుతున్న దాడిని చూసి తట్టుకోలేక వారు కూడా పెద్ద ఎత్తున వైఎస్ జగన్ ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఇక ఇదే అంశం మీద తాజాగా చంద్రబాబు కూడా రజనీకాంత్ కు ఫోన్ చేసి వాళ్లు అంటున్న మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ విషయాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు.

Also Read: Puvvada Ajay Met Jr NTR: ఎన్టీఆర్ ఇంటికి తెలంగాణ మంత్రి.. ఆరోజు షాక్ ఇస్తారా?

వెంటనే రజినీకాంత్ కూడా తాను ఈ విషయంలో బాధపడటం లేదని ఎందుకంటే తానేమి అబద్దాలు మాట్లాడలేదు ఉన్నవి ఉన్నట్టుగానే మాట్లాడాను ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఇలాంటి విషయాలు మీద స్పందించే అవకాశం లేదని తనకు అందుకు ఆసక్తి కూడా లేదని రజినీకాంత్ తేల్చి చెప్పారు. అయితే తాజాగా ఈ అంశం మీద సినీ నటుడు జగపతిబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

గోపీచంద్ హీరోగా శ్రీ వాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం రామబాణం. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో జగపతిబాబు మీడియాతో ముచ్చటించారు. ఈ ముచ్చటించిన నేపథ్యంలోనే ఒక విలేకరి రజినీకాంత్ వ్యవహారాన్ని జగపతిబాబు దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా మంత్రులందరూ రజనీకాంత్ ని టార్గెట్ చేస్తున్నారు ఇందులో మీ ఒపీనియన్ ఏమిటి అని అడిగితే దానికి జగపతిబాబు ఆసక్తికరంగా స్పందించారు. రజినీకాంత్ ఏది మాట్లాడినా నిజమైతేనే మాట్లాడతాడని ఆయన మాట్లాడేది 100% కరెక్ట్ గా మాట్లాడతాడని చెప్పుకొచ్చారు.

రజనీ మాట్లాడే విధానం పర్ఫెక్ట్ గా ఉంటుందని ఈ సందర్భంగా జగపతిబాబు కామెంట్ చేశారు. దీంతో రజనీకాంత్ వ్యాఖ్యలకు జగపతిబాబు మద్దతు పలికినట్లయింది. నిజానికి రజనీకాంత్ వ్యాఖ్యల మీద సినీ నటుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న పోసాని కృష్ణ మురళి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు ఒక్కడే సూపర్ స్టార్ అని అది మెగాస్టార్ అని చెప్పుకొచ్చారు. రజనీకాంత్ తమిళ్ లో గొప్ప వాడేమో కానీ తెలుగు వాళ్ళకి మాత్రం కాదని ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి కామెంట్లు చేశారు. మొత్తం మీద రజినీకాంత్ వ్యాఖ్యలు మాత్రం అటు పొలిటికల్ వర్గాల్లోనే కాదు సినీ వర్గాల్లో కూడా హార్ట్ టాపిక్ అయ్యాయని చెప్పక తప్పదు.

Also Read: Chandrababu Calls Rajinikanth: రజనీకాంత్ కి బాబు ఫోన్.. అభయమిచ్చిన తలైవా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News