Indian Idol: తెలుగులో ఇండియన్ ఐడల్, న్యాయ నిర్ణేతగా తమన్

Indian Idol: దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మ్యూజిక్ షో..ఇండియన్ ఐడల్. ఇప్పుడు తెలుగులో కూడా రానుంది. తెలుగు ఇండియన్ ఐడల్ కోసం ప్రముఖ సింగర్లు, మ్యుజీషియన్లు వేదిక అలంకరించేందుకు సిద్ధమౌతున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 12, 2022, 05:05 PM IST
Indian Idol: తెలుగులో ఇండియన్ ఐడల్, న్యాయ నిర్ణేతగా తమన్

Indian Idol: దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మ్యూజిక్ షో..ఇండియన్ ఐడల్. ఇప్పుడు తెలుగులో కూడా రానుంది. తెలుగు ఇండియన్ ఐడల్ కోసం ప్రముఖ సింగర్లు, మ్యుజీషియన్లు వేదిక అలంకరించేందుకు సిద్ధమౌతున్నారు. 

ఇండియన్ ఐడల్. దేశానికి కొత్త కొత్త సింగర్లను పరిచయం చేసే అద్భుత వేదిక. జీ సరిగమలానే మరొక వేదిక. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ ఇప్పుడు తెలుగులో కూడా ప్రసారం కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఈ షో ప్రసారం కానుంది. ఈ షోకు హోస్ట్‌గా సింగర్ శ్రీరామచంద్ర వ్యవహరించనున్నాడు. అటు ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత రేవంత్ కూడా షోకు ఆతిధ్యం ఇవ్వనున్నాడు. ఇక ఈ షోకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వెలువడింది.

రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ (Indian Idol) న్యాయనిర్ణేతగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అఖండ విజయంతో జోష్‌లో ఉన్న తమన్ (Thaman) చేతిలో ఉన్న భీమ్లానాయక్ పాటలు ఇప్పటికే హల్‌చల్ చేస్తున్నాయి. మహేశ్ బాబు అప్‌కమింగ్ సినిమా సర్కారువారి పాట కూడా తమన్‌దే కావడం విశేషం.

Also read: Mihir Das: ఒడిశా చిత్రపరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు మిహిర్ దాస్ కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News