Heroines Rare Medical Conditions: సమంత సహా అరుదైన వ్యాధులతో బాధ పడుతున్న హీరోయిన్లు వీరే!

Indian Heroines With Rare Medical Conditions: జబ్బులు కామన్ గానే వస్తూ ఉంటాయి కానీ కొన్ని మాత్రం అరుదైనవి ఉంటాయి, అందులో మన హీరోయిన్లకు వచ్చిన కొన్ని అరుదైన ఇబ్బందులను మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 3, 2022, 02:48 PM IST
Heroines Rare Medical Conditions: సమంత సహా అరుదైన వ్యాధులతో బాధ పడుతున్న హీరోయిన్లు వీరే!

Indian Heroines Suffering With Rare Medical Conditions: సాధారణంగా మనుషులు అన్నాక అనేక జబ్బులతో ఇబ్బంది పడటం పెద్ద విషయమేమీ కాదు కొన్ని మందులతో నయమయ్యే వ్యాధులు అయితే మరికొన్ని మందులు వాడినా జీవితాంతం వెంటాడే సమస్యలు ఉంటాయి. అయితే ఇటీవల సమంత తాను మయోసైటిస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గురించి అనేక రకాల చర్చలు జరిగాయి. కానీ అసలు సమంత ఈ మయోసైటిస్ లో ఏ విభాగానికి సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతుందనే విషయం మీద పూర్తిస్థాయి క్లారిటీ లేదు. కానీ ఆమెకు వచ్చింది ప్రాణాంతకమైన వ్యాధి అనే ప్రచారం మాత్రం జరుగుతోంది. సినీ పరిశ్రమలో ఇంకా ఎవరైనా హీరోయిన్లు ఇలా చర్మ సమస్యలతో కానీ లేదా ఇతర సమస్యలు ఏవైనా వాటితో జబ్బులతో ఇబ్బంది పడుతున్నారా? అనే విషయం మీద మేము కొంత సమాచారం సేకరించి దాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

దేవదాసు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా డిమ్ మార్ఫిక్ బాడీ డిజార్డర్ అనే ఒక వ్యాధితో బాధ పడుతోంది. ఇక సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార స్కిన్ అలర్జీ ప్రాబ్లంతో బాధ పడుతుంటే బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా డిప్రెషన్ తో బాధ పడుతోంది.

ఇక జూనియర్ ఐశ్వర్యా రాయ్ గా పేరు తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధ పడుతుంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె డిప్రెషన్ తో బాధ పడుతోంది. ఇక క్రికెటర్ కోహ్లీయే భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా మానసిక ఆరోగ్య సమస్యతో బాధ పడుతోంది. వరియా, రాంఝనా, ఢిల్లీ 6 వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనమ్ కపూర్ చాలా కాలంగా మధుమేహంతో బాధపడుతోంది.
Also Read: Ram Charan Sukumar Movie: చెర్రీ ఫాన్స్ కు బ్లాస్టింగ్ అప్డేట్.. సుకుమార్ సినిమా షూట్ కూడా మొదలు?

Also Read: Manchu Vishnu - Prabhudeva: జిన్నా డిజాస్టర్ తో బాధపడుతున్న మంచు విష్ణుకు జాక్ పాట్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News