7th Phase Lok Sabha Polls 2024: నేటితో ముగియననున్న చివరి దశ ఎన్నికల ప్రచారం.. జూన్ 1 పోలింగ్..

7th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలను.. భారత ఎన్నికల కమిషన్ 7 విడతల్లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా నేటి సాయంత్రంతో చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తోన్న వారణాసి స్థానంతో పాటు 57 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

Written by - TA Kiran Kumar | Last Updated : May 30, 2024, 06:30 AM IST
7th Phase Lok Sabha Polls 2024: నేటితో ముగియననున్న చివరి దశ ఎన్నికల ప్రచారం.. జూన్ 1 పోలింగ్..

7th Phase Lok Sabha Polls 2024:  సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరింది. నేటితో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార ఘట్టం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. ఈ సారి ఎన్నికల్లో ప్రధాన మంత్రి ఉత్తర ప్రదేశ్‌లోని హిందువులకు అత్యంత పవిత్రమైన వారణాసి స్థానం నుంచి మూడోసారి బరిలో దిగనున్నారు. వారణాసితో పాటు యూపీలో 13 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి. అటు బిహార్‌లోని 8 లోక్‌సభ స్థానాలు.. పశ్చిమ బెంగాల్‌లోని 9 లోక్ సభ సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. అటు జార్ఖండ్ రాష్ట్రంలోని 3 స్థానాలు.. పంజాబ్‌లోని 13 లోక్ సభ సీట్లు.. హిమాచల్ ప్రదేశ్‌లోని 4 లోక్ సభ సీట్లు.. ఒడిషాలోని 6 లోక్ సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగర్‌కు  ఈ విడతతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది.

జూన్ 1 జరిగే ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో 542 లోక్ సభ సీట్ల ఫలితాలను జూన్ 4న ప్రకటించనుంది ఎన్నికల కమిషన్. మొత్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ శనివారంతో ఎన్నికల క్రతువు పూర్తవుతోంది. 18వ లోక్ సభకు జరిగిన ఈ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన పార్టీ అభ్యర్ధి ప్రధాన మంత్రిగా నియమితులువుతారు. మొత్తంగా ఏప్రిల్ 19వ తేదిన ప్రారంభమైన మొదట దశ పోలింగ్.. జూన్ 1 జరిగే ఏడో విడత పోలింగ్‌తో మొత్తం 542 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి.

ఏప్రిల్ 19న మొదటి దశతో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఫస్ట్ ఫేస్‌లో 102 లోక్‌సభ స్థానాలు.. రెండో దశలో 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. థర్డ్ ఫేజ్‌లో 92 లోక్‌సభ స్థానాలు.. నాలుగో దశలో భాగంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కలిపి 92 లోక్‌సభ స్థానాలు..ఐదో దశలో 49 లోక్ సభ సీట్లు.. ఆరో దశలో 58 లోక్‌సభ సీట్లుకు ఎన్నికలు జరిగాయి. ఏడో దశలో భాగంగా 57 లోక్‌సభ సీట్లకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా రెండు నెలలకు పైగా కొనసాగిన ఈ ఎన్నికల ప్రక్రియ జూన్ 4న ఎన్నికల ఫలితాలతో పూర్తి కానుంది.
 

Also Read: KT Rama Rao: రేవంత్‌ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల కుంభకోణం.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News