Sunrisers Hyderabad Likely To Release These 5 Star Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. వరుస విజయాలతో ఫైనల్ దాకా చేరుకుని ట్రోఫీని త్రుటిలో చేజార్చుకుంది. వచ్చే ఐపీఎల్లో ట్రోఫీనే లక్ష్యంగా హైదరాబాద్ అడుగులు వేయనుంది. ఈ క్రమంలో కొందరు ప్లేయర్లను వదులుకోనుంది. రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మెగా వేలానికి ముందు ఐదుగురు స్టార్ ప్లేయర్లను వదులుకోనుంది. అయితే వారిపై కన్నేసి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాయి.
ఐపీఎల్ మెగా వేలం అనేది ప్రతి మూడు సీజన్లకు ఒకసారి జరగాలి. ఒక జట్టు మొత్తం నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవాలి. భారత ఆటగాళ్లు ముగ్గురి కంటే ఎక్కువ ఆటగాళ్లను రిటైన్ చేసుకోలేరు. విదేశీ ఆటగాళ్లు గరిష్టంగా ఇద్దరు ఉండాలి. ఇతర ఆటగాళ్లను బిడ్డింగ్ కోసం వదులుకోవాల్సిందే.
ప్రస్తుతం బ్యాటింగ్‌పరంగా బలంగా ఉన్న సన్‌రైజర్స్ ఎవరినీ వదులుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ఏ ఆటగాళ్లను వదులుకుంటుందనే చర్చ జరుగుతోంది. జట్టు ఐదుగురిని వదులుకునేలా ఉంది. ఇది కేవలం అంచనా మాత్రమే.
ఉమ్రాన్ మాలిక్: అత్యంత వేగంతో బౌలింగ్ వేసే కశ్మీర్ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ రెండు సీజన్లలో నిరాశపర్చాడు. ఈ సీజన్లో ఉమ్రాన్ అంతగా కనిపించలేదు. మెగా వేలానికి ముందు హైదరాబాద్ వదిలేసుకోనుంది.
అబ్దుల్ సమద్: జట్టులో అవకాశం లభిస్తున్నా అనుకున్నంత స్థాయిలో సమద్ ప్రదర్శన కనబర్చడం లేదు. పూర్తి సామర్థ్యం ప్రదర్శించకపోవడంతో సమద్‌ను హైదరాబాద్ త్యజించనుంది.
భువనేశ్వర్ కుమార్: చాలా సంవత్సరాలుగా సన్‌రైజర్స్ కోసం భువీ కష్టపడుతున్నాడు. సీజన్లో పర్వాలేదనిపించిన భువీని సన్‌రైజర్స్ వదులుకునే అవకాశం ఉంది.
మార్క్రమ్: ఐపీఎల్ 2023 సీజన్లో మార్క్రమ్ నాయకత్వంలో సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆ సీజన్లో హైదరాబాద్ అట్టడుగున నిలిచింది. SRH 10వ స్థానానికి చేరుకుంది. ఈ సీజన్లో అతడి వ్యక్తిగత ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో ఆరెంజ్ ఆర్మీ వదులుకునేటట్టు కనిపిస్తోంది.
గ్లెన్ ఫిలిప్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకునే వారిలో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ మొదటి వరుసలో ఉన్నాడు. ఈ సీజన్లో ఫిలిప్స్‌ను వినియోగించకపోవడంతో అతడు ఆరెంజ్ ఆర్మీ నుంచి బయటకు రానున్నాడు.