Realtor Madhu Murder Case Latest Updates: హైదరాబాద్ బిల్డర్ మధు హత్య కేసులో సంచలనం సృష్టిస్తోంది. ఆయన హత్య వెనుక ఓ ప్రేమ కథ ఉన్నట్లు తెలుస్తోంది. కూతురి ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తున్నాడని.. ఆయనకు ఉన్న కోట్ల ఆస్తిపై కన్నేసిన స్నేహితులే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా.. హైదరాబాద్ నివాసి అయిన బిల్డర్ మధుకు రూ.200 కోట్ల ఆస్తి ఉంది. ట్రావెల్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. ఆయన చికోటి ప్రవీణ్‌కు అనుచరుడిగా ఉన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యాపారం నిమిత్తం కోసం బీదర్‌కు తరచూ వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 24వ తేదీన బీదర్‌కు వెళ్లిన ఆయన దారుణ హత్యకు గురయ్యారు. తలపై బండ రాయితో కొట్టి.. ఆ తరువాత కత్తులతో పొడిచి చంపేశారు.
Also Read: June Rules: జూన్ 1 నుంచి బ్యాంకింగ్ సహా పలు రంగాల్లో మారబోయే నిబంధనలు ఇవే..
రేణుక ప్రసాద్(32), వరుణ్, లిఖిత్ సిద్దార్థరెడ్డితో మధుకుస్నేహం ఉంది. క్యాసినో ఆటలో రేణుకా ప్రసాద్ గ్యాంగ్‌తో పరిచయం ఏర్పడింది. ప్రతి ఏడాది మధు నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలోనే మధు కూతురిపై కన్నేసిన రేణుకా ప్రసాద్.. ఆ అమ్మాయిని ప్రేమలోకి దింపాడు. తమ ప్రేమ వ్యవహారం మధుకు చెప్పి.. కూతురిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని కోరాడు. అయితే ఇందుకు మధు ఒప్పుకోలేదు. దీంతో మధుపై రేణుకా ప్రసాద్ కక్ష్య పెంచుకున్నాడు.
ఇటీవల తన కూతురుకు మధు పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు. తనకు ఇచ్చి పెళ్లి చేయకుండా వేరే వారితో పెళ్లి చేస్తున్నాడని మధు హత్యకు రేణుకా ప్రసాద్ స్కెచ్ వేశాడు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి హైదరాబాద్‌లోనే హత్య చేయాలని చూశాడు. అయితే ఇక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఈ నెల 24న కేసినో ఆడుదామంటూ మధును బీదర్‌కు తీసుకెళ్లారు. అ
అక్కడే రాళ్లతో దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆయన ఒంటిపై ఉన్న ఆరు తులాల బంగారంతోపాటు నగదును కూడా తీసుకువెళ్లిపోయారు. కారు నంబరు ఆధారంగా గుర్తించి ఈ నెల 25న జీడిమెట్ల పోలీసులకు, కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ప్రేమ విషయంలో అడ్డు వస్తున్నాడనే కోపం, కోట్ల ఆస్తిపై కన్నేసి రేణుకా ప్రసాద్ హత్యకు ప్లాన్ వేసినట్లు తేలిసింది. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.
Also Read: Lucknow: తాగడానికి ఒప్పుకోలేదని దారుణం.. టెర్రస్ పై నుంచి తోసేసిన మందు బాబులు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter