Lucknow man thrown off from roof for refusing to drink alcohol: మద్యం మత్తులో కొందరు విచ్చల విడిగా ప్రవర్తిస్తుంటారు. రోడ్ల మీద వచ్చేసి నానా హంగామాలు చేస్తుంటారు. మనం డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనల్లో ఎక్కువ మంది, అడ్డంగా దొరికి పోయి పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఘటనలు తరచుగా చూస్తుంటాం. కొందరు తప్పతాగి రోడ్ల మీద వాహనాలను నడిపిస్తు, వారి డెంజర్ లో పడటమే కాకుండా ఇతరులను ప్రమాదాల్లో నెట్టేస్తుంటారు. మద్యం తాగి హంగామా చేయడంలో యువకులు, అమ్మాయిలు కూడా ఉంటున్నారు. బార్ లలో పీకల దాక తాగి, రోడ్ల మీదకు రాత్రిళ్లు నానా రచ్చ చేస్తుంటారు. రోడ్ల మీద వాహనాలను ఆపుతూ, ఇతరులకు ఇబ్బందులు కల్గిస్తుంటారు. అంతటితో ఆగకుండా మత్తులో గొడవలు పడుతుంటారు.
#मदेयगंज थाने के अंतर्गत दबंगों ने युवक को #जान से मारने की नीयत से छत से फेंका। दबंग किस्म के अमित गौतम,#अंकुर और उसके दो अन्य साथियों को युवक को छत से उठाकर फेका। @myogiadityanath @homeupgov @CMOfficeUP @dgpup @Uppolice @LkoCp @lkopolice @dcpcentrallko pic.twitter.com/EEOvFCIUAX
— जीत नारायण पत्रकार (@jeetKirankamal) May 25, 2024
కొన్ని సమయాల్లో హత్యలు చేయడానికి సైతం వెనుకాడరు. తాగి వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం తరచుగా వార్తలలో చూస్తుంటాం. తాగిన మైకంలో సరదాగా మాట్లాడుకుని, ఆతర్వాత గొడవలు పడి కొట్టుకుంటారు. ఇది అదుపు తప్పి, హత్యలు చేసుకొవడం వరకు వెళ్లిన ఘటనలు అనేకం జరిగాయి. కొందరు తాగుదామని తీసుకెళ్లి , పీకల దాక తాగించి, బండరాళ్లు, మారణాయుధాలతో హత్యలు చేసిన ఘటనలు కూడా మనం చూశాం. మద్యం మత్తులో ఏంచేస్తున్నారో వారికి తెలియని పరిస్థితుల్లో కొందరు ఉంటారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న రుప్పుర్ ఖద్రా అనే చోట.. రంజిత్ సింగ్ అనే వ్యక్తి ఇంటికి నలుగురు తాగడానికి తొలుత వచ్చారు. టెర్రస్ మీద కూర్చుని తాగుతామంటూ కూడా చెప్పారు. కానీ అతను అంగీకరించలేదు. ఇక మరుసటి రోజు మరల వచ్చి, డైరెక్ట్ గా టెర్రస్ మీదకు వెళ్లిపోయి కూర్చున్నారు. అంతటితో ఆగకుండా ఫుల్ గా తాగి న్యూసెన్స్ చేశారు. తమను తాగొద్దంటాడా.. అంటూ రంజిత్ సింగ్ పై కోపంతో వాగ్వాదానికి దిగారు. తమతో పాటు తాగాలని కూడా బలవంతం చేశారు. అతను ఒప్పుకొక పోవడంతో బలవంతంగా తాగించేందుకు ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో.. రంజిత్ సింగ్ ను టెర్రస్ మీద నుంచి కిందకు తోసేశారు. దీంతో బాధితుడు ఒక్కసారిగా గేట్ మీద పడి, రోడ్డు మీద పడిపోయాడు. రోడ్డు మీద ఉన్న వారు అతడిని కాపాడటానికి ప్రయత్నం చేసిన కూడా, మరల ఆగంతకులు టెర్రస్ మీద నుంచి వచ్చి, బాధితుడిని కాళ్లలో తన్నుతూ పైశాచికంగా ప్రవర్తించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన సురేందర్ కుమార్, హేమంత్ కుమార్, అమర్ గౌతమ్ లను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడు రంజిత్ సింగ్ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter