Nithiin Babai Hotel : బాబాయ్ హోటల్ కోసం నితిన్.. అంజన్న దీక్షలో స్టార్ హీరో

Nithiin Babai Hotel యంగ్ హీరో నితిన్ తాజాగా దైవచింతనలో మునిగిపోయాడు. అంజన్న దీక్షలో కనిపించాడు. నితిన్ చేతులు మీదుగా బాబాయ్ హోటల్ బ్రాంచ్‌ను మణికొండలో ప్రారంభించడం జరిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 12:49 PM IST
  • అంజన్న దీక్షలో హీరో నితిన్
  • బాబాయ్ హోటల్ కోసం బయటకు వచ్చిన హీరో
  • మణికొండలో బాబాయ్ హోటల్ ప్రారంభం
Nithiin Babai Hotel : బాబాయ్ హోటల్ కోసం నితిన్.. అంజన్న దీక్షలో స్టార్ హీరో

Babai Hotel Manikonda విజయవాడలో బాబాయ్ హోటల్ గురించి తెలియని వారుండరు. గత ఎనభై ఏళ్ల నుంచి బాబాయ్ హోటల్ బ్రాండ్ తన స్థాయిని పెంచుకుంటూనే పోతోంది. అలాంటి బాబాయ్ హోటల్‌ బ్రాంచ్‌ను హైద్రాబాద్‌లోని మణికొండలో ప్రారంభించారు. యంగ్ హీరో నితిన్ చేతుల మీదుగా ఈ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో సినీ ప్రముఖులెందరో పాల్గొన్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామ జోగయ్య శాస్త్రి, రచయిత దర్శకుడు వక్కంతం వంశీ, నిర్మాత ఠాగూర్ మధు తదితరులు పాల్గొని బెస్ట్ విషెస్ తెలిపారు. 

డైరెక్టర్ శశికాంత్ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పేరు మీదే ఈ బాబాయ్ హోటల్‌ను హైద్రాబాద్‌లోని మణికొండకు తీసుకొచ్చారు. అయితే ఈ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఎనిమిది దశాబ్దాలుగా విజయవాడలో ప్రఖ్యాతి గాంచిన బాబాయ్ హోటల్‌ని మణికొండకి తీసుకురావడం సంతోషంగా ఉందని, అద్భుతమైన వంటకాలని చక్కటి శుచీశుభ్రతలతో అందిస్తున్నామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఒక్కసారి రుచి చూసిన వాళ్లు పర్మినెంట్‌ కస్టమర్లుగా మారుతారు అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం నితిన్ ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. శ్రీ ఆంజనేయం సినిమాలోనూ నితిన్ నటించిన విషయం తెలిసిందే. మరి అప్పటి నుంచి ఈ భక్తి భావం ఏర్పడిందో ఏమో గానీ ఇప్పుడిలా అంజన్న స్వామి దీక్షలో నితిన్ కనిపించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

 

Also Read:  Disha Patani Pics : చెక్కిన శిల్పంలా ఉంది!.. ఒంపుసొంపులు కనిపించేలా దిశా పటానీ అందాల ప్రదర్శన

Also Read: Deva Katta : ఆ స్క్రిప్ట్ నాదే.. బీర్ బాటిల్స్ నావి కాదు.. దేవా కట్టా పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News