Puri Jagannadh : లైగర్‌ ఎఫెక్ట్.. చాలా రోజులకు పూరి జగన్నాథ్ చిల్.. పిక్ వైరల్

Harish Shankar with Puri Jagannadh పూరి జగన్నాథ్ ప్రస్తుతం బయటకు రావడం లేదు. తన లైగర్ వివాదాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే ఇప్పుడు మాత్రం హరీష్ శంకర్‌ స్పెషల్‌గా పూరిని కలిసినట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 06:09 PM IST
  • బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డ లైగర్
  • పూరి జగన్నాథ్ ఆడియో లీక్ వివాదం
  • ముంబైలో పూరిని కలిసి హరీష్‌ శంకర్
Puri Jagannadh : లైగర్‌ ఎఫెక్ట్.. చాలా రోజులకు పూరి జగన్నాథ్ చిల్.. పిక్ వైరల్

Harish Shankar with Puri Jagannadh : పూరి జగన్నాథ్‌కు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చిన పేరు అంతా కూడా లైగర్‌తో పోయింది. ఇస్మార్ట్ శంకర్ కమర్షియల్‌గా వర్కౌట్ అయింది. లైగర్ సినిమా సైతం నిర్మాతలుగా పూరి, ఛార్మీలు సేఫ్ కానీ.. డిస్ట్రిబ్యూటర్లకు దెబ్బ పడినట్టు టాక్. మొత్తానికి లైగర్ సినిమా దగ్గరదగ్గరగా డెబ్బై కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కలెక్షన్లే రెండు వందల కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది.. దాన్నే తాను పరిగణిస్తాను అంటూ ప్రమోషన్స్‌లో విజయ్ చేసిన అతి కామెంట్లు ఎంతగా ట్రోలింగ్‌కు గురైందో అందరికీ తెలిసిందే.

లైగర్ సినిమా బెడిసి కొట్టడానికి ఎన్నో కారణాలున్నాయి. పూరి కథ, కథనం, టేకింగ్ ఒకెత్తు అయితే.. విజయ్ యాటిట్యూడ్, ప్రమోషన్స్‌లో చెప్పిన అతి మాటలు ఇంకో కారణం. వెరసి లైగర్‌ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాన్ని ఇచ్చినట్టు అయింది. ఈ సినిమాతో పూరి, విజయ్ లైఫ్ అంతా కూడా తలకిందులైంది. జన గణ మన సినిమా ఆగిపోయింది. ఎంతో గొప్పగా లాంచ్ చేసినా, ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసినా కూడా లైగర్ ఫలితంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కిపోయింది.

 

ఇక లైగర్ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, వారితో పూరి గొడవలు, పూరి ఆడియో లీక్ అవ్వడం ఇదంతా ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. ఇక పూరి జగన్నాథ్ లైగర్ సినిమాకు ఎవరు డబ్బులు సమకూర్చారంటూ ఈడీ, ఐటీ వాళ్లు కూడా కన్నేసిన సంగతి తెలిసిందే. ఇదంతా ఇలా ఉంటే.. ఇప్పుడు పూరి మాత్రం కాస్త రిలాక్స్ అయినట్టు తెలుస్తోంది.

లైగర్ తరువాత ఇలా ఫుల్ చిల్ అవుతున్నట్టుగా కనిపిస్తోన్న ఫోటో ఇదే. హరీష్‌ శంకర్ తాజాగా ముంబైకి వెళ్లినట్టు కనిపిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌తో కలిసి బాలీవుడ్ సెలెబ్రిటీలతో హరీష్ చిల్ అయ్యాడు. అదే సమయంలో ఇలా పూరిని కూడా కలిసినట్టు కనిపిస్తోంది. థాంక్స్ గురూజీ అంటూ చాలా రోజుల తరువాత ఇలా మాట్లాడుకున్నాం.. మీరెప్పుడూ నాకు అండగానే ఉంటున్నందుకు థాంక్స్ అని పూరి గురించి చెప్పుకొచ్చాడు హరీష్‌ శంకర్.

Also Read : Ileana Latest Pics : ఫుల్లుగా కప్పేసుకున్న ఇలియానా.. కొత్త లుక్కులో గోవా బ్యూటీ

Also Read : Jabardasth Anchor Sowmya : హే చీ పోరా.. హైపర్ ఆదికి జబర్దస్త్ యాంకర్ పంచ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News