Youtuber Gayathri's Death news: యూట్యూబర్ గాయత్రి మృతి.. మద్యం మత్తు, అతివేగమే కారణమా ?

Youtuber Gayathri Death News: గచ్చిబౌలి రోడ్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన ప్రముఖ యూట్యూబర్ గాయత్రి చనిపోయింది. అతివేగం, నిర్లక్ష్యం ఎంతో కెరీర్ ఉన్న ఓ యూట్యూబర్‌తో పాటు మరో ఇద్దరి ప్రాణాలు తీసింది. హోలీ సందర్భంగా వేడుకలు చేసుకున్న యూట్యూబర్ గాయత్రి.. తన స్నేహితుడితో కలిసి ప్రిజమ్ పబ్‌కు వెళ్లింది. అక్కడ పార్టీ చేసుకున్న గాయత్రి తిరిగొచ్చే క్రమంలో విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలివైపు వస్తుండగా కారు అదుపుతప్పింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2022, 05:25 PM IST
  • హోలీ వేడుకల్లో పాల్గొని వస్తుండగా అదుపుతప్పి బోల్తాపడిన కారు
  • యూట్యూబ్‌లో డాలిపేరుతో ఫేమస్ అయిన గాయత్రి పలు షార్ట్ ఫిలిమ్స్‌
  • హోలీ వేడుకల్లో పబ్‌లో మద్యం తీసుకున్నట్లు అనుమానాలు
Youtuber Gayathri's Death news: యూట్యూబర్ గాయత్రి మృతి.. మద్యం మత్తు, అతివేగమే కారణమా ?

Youtuber Gayathri Death News: గచ్చిబౌలి రోడ్ యాక్సిడెంట్‌లో ప్రముఖ యూట్యూబర్ గాయత్రి చనిపోయింది. హోలీవేడుకల్లో పాల్గొని వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడటంతో అక్కడకక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో అభంశుభం తెలియని ఓ మహిళతో పాటు.. కారులో ఉన్న మరో వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. మద్యం మత్తుతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానాలు వస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం ఎంతో కెరీర్ ఉన్న ఓ యూట్యూబర్‌తో పాటు మరో ఇద్దరి ప్రాణాలు తీసింది. హోలీ సందర్భంగా వేడుకలు చేసుకున్న యూట్యూబర్ గాయత్రి.. తన స్నేహితుడితో కలిసి ప్రిజమ్ పబ్‌కు వెళ్లింది. అక్కడ పార్టీ చేసుకున్న గాయత్రి తిరిగొచ్చే క్రమంలో విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలివైపు వస్తుండగా కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఓ మహిళపైకి దూసుకుపోయి డివైడర్‌పై పల్టీ కొట్టింది.

ఈ ప్రమాదంలో మళ్లీశ్వరి అనే మహిళ అక్కడికక్కడే చనిపోయింది. కారులో ఉన్న గాయత్రితో పాటు ఆమె స్నేహితుడు రోహిత్ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ వెంటనే ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే చికిత్సపొందుతూ గతరాత్రే గాయత్రి చనిపోయింది. యూట్యూబ్‌లో డాలిపేరుతో ఫేమస్ అయిన గాయత్రి పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించారు. కొంతకాలంగా రోహిత్‌తో ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. హోలీ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లిన రోహిత్.. ఆమెను పికప్ చేసుకొని ప్రిజం పబ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ చేసుకొని తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ప్రమాద సమయంలో గాయత్రి కార్ డ్రైవ్ చేస్తున్నట్లు.. అతివేగమే యాక్సిడెంట్‌కు కారణమని తెలుస్తోంది. పబ్‌లో మద్యం తీసుకున్నట్లు కూడా అనుమానాలు వస్తున్నాయి.

హోలీ రోజు మద్యం అమ్మడం నిషేధం. ఈ నేపథ్యంలో వారికి పబ్‌లో మద్యం ఎలా దొరికిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గాయత్రి మృతిపట్ల పలువురు టాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు. ఇది చాలా అన్యాయం.. నమ్మడానికి చాలా కష్టంగా ఉందంటూ క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేశారు. అటు బిగ్‌బాస్ ఫేం షణ్నూ సైతం గాయత్రితో (Youtuber Gayathri car accident) దిగిన ఫోటోను షేర్ చేశాడు. హార్ట్ బ్రేక్ సింబల్ జతచేశాడు.

Also read : Chiranjeevi vs Salman Khan: పైసల్ ఇస్తానంటే.. నేను ఇక్కడినుంచి ఎల్లిపోతా! చిరంజీవికి సల్మాన్ ఖాన్ వార్నింగ్!!

Also read : Janhvi Kapoor Photos: అందమైన పోజులతో ఆకట్టుకుంటున్న బబ్లీ బ్యూటీ జాన్వీ కపూర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News