Mrunal Thakur: తెలుగులో సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాను.. మృణాల్ సెన్సేషనల్ కామెంట్స్

Mrunal Thakur Family Star: సీతారామం సినిమాతో సౌత్ ఇండియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. కాగా ప్రస్తుతం ఈ నటి తెలుగు సినిమాల పైన చేసిన కామెంట్స్ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 7, 2024, 12:19 PM IST
Mrunal Thakur: తెలుగులో సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాను.. మృణాల్ సెన్సేషనల్ కామెంట్స్

Mrunal Thakur about Tollywood 
హిందీలో సీరియల్స్ లో చేస్తూ పేరు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఆ తరువాత ఈ హీరోయిన్ కొన్ని హిందీ సినిమాలలో కనిపించిన అవి ఆమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు. అయితే హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన సీతారామం చిత్రంలో సీత పాత్రతో సౌత్ ఇండియా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది ఈ నటి. ఈ సినిమా ఆమెకు సౌత్ ఇండియాలో బ్లాక్ బస్టర్ విజయం తెచ్చి పెట్టడమే కాకుండా.. స్టార్ హీరోయిన్ గా కూడా పేరు తెచ్చి పెట్టింది.

ఇక ఆ తరువాత నాని మీతో చేసిన హాయ్ నానా సినిమా కూడా ఈ హీరోయిన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అప్పటి నుంచి మృణాల్ కి వరుస అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ హీరోయిన్ నటించిన ఫ్యామిలీ స్టార్ మొన్న శుక్రవారం థియేటర్స్ లో విడుదలై పర్వాలేదు అనిపించుకుంటుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది.

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. నాకు భాష రాని ప్రదేశంలో ఉండడం చాలా కష్టం అనిపిస్తుంది. సీతారామం సినిమాలో తెలుగు భాష రాక చాలా కష్టపడ్డాను. నాకు కేవలం హిందీ, మరాఠి మాత్రమే వచ్చు. తెలుగు నేర్చుకోవడం నాకు చాలా కష్టం అనిపించేది. ఎంత నేర్చుకుందామని ట్రై చేసిన నాకు తెలుగు రాలేదు. సీతారామం సినిమా షూటింగ్ టైంలో భాషరాక ఏడ్చేసాను కూడా. ఇక అప్పుడే తెలుగులో సీతారామం తర్వాత మళ్ళీ సినిమాలు చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఆ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరిగేటప్పుడు దుల్కర్ సల్మాన్ కి ఇదే నా ఫస్ట్ & లాస్ట్ తెలుగు సినిమా అని కూడా చెప్పేసా, ఇకపై తెలుగులో సినిమాలు చేయనని చెప్పాను. కానీ నాకు అప్పట్లో దుల్కర్ చాలా ధైర్యం చెప్పేవారు.. ఇప్పుడు తమిళ్, కన్నడలో కూడా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను అంటే అది కేవలం దుల్కర్ వల్లే అని తెలిపింది.”

ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: Tukkuguda Congress Meeting: కేసీఆర్ ను బహిరంగంగా ఉరితీయాలే.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ..

Also Read: CM Revanth Reddy: పదేళ్లు అడవి పందుల్లా దోచుకున్నారు.. కేసీఆర్ కు సీఎం రేవంత్ ధమ్కీ.. వైరల్ గా మారిన వీడియో..

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News