Trivikram Srinivas: దర్శకుడు త్రివిక్రమ్ కారును ఆపిన ట్రాఫిక్ పోలీస్... జరిమానా విధింపు...

Traffic Police fine for Trivikram: సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 01:39 PM IST
  • దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారు ఆపిన ట్రాఫిక్ పోలీస్
  • కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో జరిమానా విధింపు
  • బ్లాక్ ఫిల్మ్ తొలగించిన పోలీసులు
 Trivikram Srinivas: దర్శకుడు త్రివిక్రమ్ కారును ఆపిన ట్రాఫిక్ పోలీస్... జరిమానా విధింపు...

Traffic Police fine for Trivikram: సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీల సందర్భంగా త్రివిక్రమ్ కారును ఆపిన పోలీసులు... కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి చలానా ఇష్యూ చేశారు. ఆ సమయంలో కారులోనే ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. పోలీసుల సూచన మేరకు బ్లాక్ ఫిల్మ్ తొలగించేందుకు సహకరించారు.

గత కొద్దిరోజులుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లకు జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హీరోలు అల్లు అర్జున్, మంచు మనోజ్, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించి జరిమానా విధించారు. సెలబ్రిటీలు అయినంత మాత్రానా నిబంధనలకు అతీతులు కాదని... తప్పనిసరిగా రూల్స్ పాటించాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'అతడు' ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలవగా.. 'ఖలేజా' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ బుల్లితెరపై మాత్రం సంచలనమే సృష్టించింది. ఈ ఇద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Also Read: Lemon Price: మార్కెట్లో నిమ్మకాయలకు భారీ డిమాండ్.. ఒక్క నిమ్మకాయ ధర రూ.10!

Also Read: AP New Districts: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి రానున్న కొత్త జిల్లాలు.. సీఎం జగన్ సందేశం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News