Family Star Collections:
విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే ఈ చిత్రం టీజర్, ట్రైలర్ పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇక దీంతో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న మంచి విజయం సాధించొచ్చు అని అభిమానులు ఫిక్స్ అయ్యారు.
కానీ సినిమా విడుదలైన తరువాత కథ మొత్తం మారిపోయింది. మొదటి షో నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రం. చూసినవారు సెకండ్ హాఫ్ మరీ రాడ్ లాగా ఉంది అంటూ కామెంట్లు పెట్ట సాగారు. ఇక రెండో షో నుంచే ఈ చిత్రం బుకింగ్స్ సైతం తగ్గిపోయాయి. మరోపక్క ఈ చిత్రానికన్నా ఒక వారం ముందు విడుదలైన టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుండగా.. ఈ సినిమా మాత్రం మొదటి రోజే ఢీలా పడిపోయింది. ఇక దీంతో నిర్మాత దిల్ రాజు పెద్ద ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాకి వీకెండ్స్ లో ఎలాగైనా కలెక్షన్లు తెప్పించాలని తన వంతు కృషి చేయడం మొదలుపెట్టారు.
అయితే దీనికోసం దిల్ రాజు చేసిన పని ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ దిల్ రాజు ఏం చేశారు అంటే ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం ఆయన ఏకంగా రిపోర్టర్ గా మారిపోయారు. సినిమా థియేటర్ ముందు మైక్ పట్టుకొని తిరిగారు.
తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం దిల్ రాజు మైక్ పట్టుకొని హైదరాబాదులోని పలు థియేటర్స్ వద్ద ఆడియన్స్ రివ్యూలు తీసుకున్నారు. నిన్న రాత్రి పలు థియేటర్స్ వద్ద దిల్ రాజు స్వయంగా వెళ్లి సినిమా చూసిన ప్రేక్షకుల ముందు మైక్ పట్టుకొని.. సినిమా ఎలా ఉంది అని ప్రశ్నించి స్వయంగా రివ్యూలు తీసుకున్నారు. ఇక దిల్ రాజు ఇలా రివ్యూలు తీసుకునే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#DilRaju dons the hat of a reporter, gathering public talk at theaters for #FamilyStar, and the response is overwhelmingly positive😆
#VijayDeverakonda pic.twitter.com/1mJiHrkoP6
— KLAPBOARD (@klapboardpost) April 6, 2024
అయితే ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమాకి ఎంత చెయ్యడం అవసరమా అని ఈ వీడియోలో కింద కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
FAMILY AUDIENCE RESPONSE ✅#DilRaju Garu Mass 🔥🔥🔥🔥
Big Producer Came to the Theatre’s For a Public Opinion 💥💥💥💥#TheFamilyStar #VijayDevarakonda pic.twitter.com/wEVboDdEmc
— GetsCinema (@GetsCinema) April 6, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook