Movie Actors Visits Tirumala: తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. సాధారణ భక్తులతోపాటు వీఐపీ భక్తులు కూడా తిరుమల బాట పడుతున్నారు. తాజాగా తిరుమల క్షేత్రాన్ని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనం చేసుకున్న అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారి రాకతో తిరుమలలో సందడి వాతావరణం నెలకొంది. వారితో భక్తులు ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఇంతకీ శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు ఎవరో కాదు సినీ నటి సంయుక్త మీనన్, ప్రముఖ గాయని మంగ్లీ, యువ నటుడు ఆకాశ్ పూరీ ఉన్నారు.
Also Read: Bhairavam Teaser: 'పుష్ప'ను మించి బెల్లంకొండ శ్రీనివాస్.. ఊరమాస్‌గా 'భైరవం' ట్రైలర్
తిరుమల శ్రీవారిని 'సార్' ఫేమ్ హీరోయిన్ సంయుక్త మీనన్ మంగళవారం ఉదయం నైవేద్య విరామంలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల కనిపించిన హీరోయిన్ సంయుక్త మీనన్‌తో భక్తులు సెల్ఫీ ఫొటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. 'దేవుడి దర్శనం బాగా జరిగింది. ఈ సంవత్సరంలో చాలా సినిమాలు చేస్తున్న నాకు ఈ సంవత్సరం చాలా కీలకం. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడం నాకు సంప్రదాయం' అని సంయుక్త మీనన్ తెలిపారు.
Also Read: VK Naresh: 'మా అమ్మ కోసం కేసీఆర్ తీవ్రంగా కృషి చేశారు': సీనియర్ నటుడు నరేశ్
తిరుమల వెంకటేశ్వర స్వామిని తెలంగాణకు చెందిన ప్రముఖ గాయని మంగ్లీతోపాటు యువ నటుడు ఆకాశ్ పూరి వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరిద్దరూ కూడా ఉదయం నైవేద్య విరామంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయం వెలుపల కనిపించిన వీరితో భక్తులు ఫొటోలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆకాశ్ పూరి మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రస్తుతం నేను 'తల్వార్' అనే సినిమా చేస్తున్నా. ఈ నెలాఖరున ఈ సినిమా ప్రారంభం అవుతుంది. సినిమా కోసం స్వామి వారి ఆశీస్సులు కోసం తిరుమల వచ్చా' అని ఆకాశ్ పూరి తెలిపారు. కాగా తిరుమలను సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తర ద్వార దర్శనాలు ముగియడంతో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి భారీగా హుండీ ఆదాయం లభిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.