కైకాల ఆరోగ్యంపై చిరు ట్వీట్...త్వరలో ఇంటికి తిరిగి వస్తారన్న మెగాస్టార్...

అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సత్యనారాయణతో తాను ఫోన్లో మాట్లాడినట్లు చిరు తెలిపారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 01:05 PM IST
కైకాల ఆరోగ్యంపై చిరు ట్వీట్...త్వరలో ఇంటికి తిరిగి వస్తారన్న మెగాస్టార్...

Chiranjeevi:సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) స్పందించారు. సత్యనారాయణ(Kaikala Satyanarayana)తో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. తన మాటలకు ఆయన ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ మేరకు చిరంజీవి తాజాగా ఓ ట్వీట్‌(Tweet) చేశారు.

''ఐసీయూలో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలియగానే క్రిటికల్‌ కేర్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం ఆ క్షణం నాకు కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, ‘‘త్వరలో మీరు ఇంటికి తిరిగి రావాలి, అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలి’’ అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్‌అప్‌ సైగ చేసి, థ్యాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్‌ సుబ్బారెడ్డి నాతో చెప్పారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది''’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

యముడికి మొగుడు’, ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘బావగారూ బాగున్నారా’ వంటి సినిమాల్లో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. చివరిసారిగా 2019లో విడుదలైన 'ఎన్టీఆర్ కథా నాయకుడు', 'మహర్షి' (Maharshi movie) చిత్రాల్లో కైకాల వెండితెరపై మెరిశారు. అప్పటినుంచి ఆయన మళ్లీ వెండి తెరపై కనిపించలేదు.

Also Read: టాలీవుడ్ దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత... ఆరోగ్య పరిస్థితి విషమం...?

చికిత్స కొనసాగుతోంది: అపోలో వైద్యులు
కైకాల ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు(Apollo Doctors) మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని చెప్పారు. మరోవైపు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News