Chiranjeevi : నా కలను నెరవేర్చాడు.. తేజ సజ్జపై మెగాస్టార్ పొగడ్తల వర్షం

Teja Sajja : చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడు అయిన తేజ సజ్జ ఇప్పుడు హీరోగా కూడా మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ మధ్యనే విడుదలైన హను మ్యాన్ సినిమాతో తేజ సజ్జ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా సినిమా గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 13, 2024, 09:47 AM IST
Chiranjeevi : నా కలను నెరవేర్చాడు.. తేజ సజ్జపై మెగాస్టార్ పొగడ్తల వర్షం

Chiranjeevi about Teja Sajja : ఎంత పెద్ద హీరో అయినా ఒక్క ఫ్లాప్ సినిమా అతని మార్కెట్ ను దెబ్బతీస్తుంది. అదేవిధంగా ఎంత చిన్న హీరో అయినా ఒక బ్లాక్ బస్టర్ అతని కెరియర్ ను మార్చేస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తేజ విషయంలో కూడా అదే జరిగింది. 

జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్న తేజ సజ్జ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హను మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. స్టార్ హీరో సినిమాలను సైతం పక్కకు నెట్టి ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యనే ఆహా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 

తనకి ఎంతో ఇష్టమైన దైవం హనుమంతుడే అని, హనుమంతుడి మీద సినిమా చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదని చెప్పిన చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్ గా తన స్ఫూర్తితో వచ్చిన తేజ ఇప్పుడు అలాంటి సినిమా చేయడం తనకి చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. హను మ్యాన్ సక్సెస్ చూశాక తనే ఆ విజయాన్ని సాధించినంత ఆనందంగా ఉందని అన్నారు చిరు. 

చూడాలని ఉంది, ఇంద్ర, ఠాగూర్, అందరివాడు లాంటి మెగాస్టార్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ ఇప్పుడు చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ చేసి, దానితో బ్లాక్ బస్టర్ అందుకోవడం గొప్ప విషయం అని చెప్పుకోవాలి. 

మరోవైపు చిరంజీవి ఇప్పుడు బింబిశార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విశ్వంభర అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రధాన బాక్ డ్రాప్ హనుమంతుడు మీదే ఉంటుందని సమాచారం. ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం సినిమాలో ఒక భారీ హనుమంతుడి విగ్రహాన్ని కూడా పెట్టారని అందరికీ తెలిసిందే.

Also Read: Student Warn To Teacher: 'సార్‌ మార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తా'.. జవాబుపత్రంలో విద్యార్థి వార్నింగ్‌

Also Read: BJP Candidate Viral Photo: ఎంపీ అభ్యర్థి అత్యుత్సాహం.. ప్రచారంలో యువతి బుగ్గపై ముద్దు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News