Charmi Kaur Social Media Break: బతకండి, బతకనివ్వండి.. మళ్ళీ బలంగా వస్తాం.. కీలక ప్రకటన చేసిన ఛార్మీ!

Charmi Kaur Announces a Break from Social Media over Liger Result: ఛార్మీ కౌర్ సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 4, 2022, 01:09 PM IST
Charmi Kaur Social Media Break: బతకండి, బతకనివ్వండి.. మళ్ళీ బలంగా వస్తాం.. కీలక ప్రకటన చేసిన ఛార్మీ!

Charmi Kaur Announces a Break from Social Media over Liger Result: లైగర్ సినిమా డిజాస్టర్ ఫలితం అందుకున్న నేపథ్యంలో గత కొన్నాళ్లుగా చార్మి కౌర్ సహా సినిమా యూనిట్లో ఎవరూ కూడా ఈ సినిమా గురించి ప్రమోషన్స్ కూడా చేయని పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా యూనిట్ తరఫున ఛార్మి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. కొన్నాళ్ళు సోషల్ మీడియా నుంచి ఒక బ్రేక్ తీసుకుంటున్నా, పూరి కనెక్ట్స్ మళ్లీ అదే బలంతో తిరిగి వస్తుంది, మరింత పెద్దగా మరింత బెటర్గా తిరిగి వస్తామని చెబుతూ అప్పటివరకు మీరు బతకండి, మనుషుల్ని బతకనివ్వండి అంటూ ఆమె ట్వీట్ చేశారు.

ఇక పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా రూపొందిన లైగర్ సినిమాకు చార్మి సహనిర్మాతగా వ్యవహరించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద చార్మి, పూరీ జగన్నాథ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. కరణ్ జోహార్ అలాగే అపూర్వ మెహతా ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా ఫలితాన్ని ఊహించలేదని చార్మి గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.

కచ్చితంగా సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది అని భావించామని కానీ ఈ ఫలితం తమ నిరాశపరిచిందని చెప్పుకొచ్చారు. అంతేకాక కార్తికేయ 2 సినిమా సూపర్ హిట్ కావడం మా సినిమా డిజాస్టర్ కావడం కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉందని కూడా ఛార్మి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇక జనగణమన సినిమా నిలిచిపోయింది అంటూ వార్తలు వస్తున్న తరుణంలో చార్మి ఇలా స్పందించడం మీద పలు ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. చార్మి కూడా సినిమా నిలిచిపోయిందనే విషయాన్ని తన ట్వీట్ ద్వారా పరోక్షంగా హింట్ ఇస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే అదేమీ లేదని చార్మికౌర్ సోషల్ మీడియాలో నెగిటివిటీ ఉందని కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటే అలా అర్థం చేసుకోవడంలో ఏమీ అర్థం లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Also Read: Deverakonda Returns Remuneration: విజయ్ దేవరకొండ ఛార్మీకి ఆ డబ్బు తిరిగిచ్చేశాడా ?

Also Read: Simhasanam Movie in 8K Ultra HD Version: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 80'స్ బాహుబలి సింహాసనం' రీ రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News