Producer C kalyan on Council election గత కొన్ని రోజులుగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిపై కావాలనే బురద జల్లుతున్నారని నిర్మాత సి కళ్యాణ్ మండి పడ్డారు. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చిన ఆయన వివాదాలకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఎఫ్ఎన్‌సీసీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నిర్మాతలమండలికి ఎన్నికలు నిర్వహించబోతోన్నట్టుగా ప్రకటించారు.
మండలిలో రెగ్యులర్ సభ్యులు 1200మంది వున్నారని, సంస్థకి ఎవరు చెడ్డ పేరు తెచ్చినా ఊరుకోమని హెచ్చరించాడు. అలాంటి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామనియ అందుకే ప్రొడ్యూసర్ కే సురేష్ కుమార్‌ని మూడేళ్లు సస్పెండ్ చేశామని గుర్తు చేశాడు. అలాగే యలమంచి రవికుమార్‌ని ఈరోజు నుంచి తమ సంస్థ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నామని ప్రకటించాడు.
గత నలభై ఏళ్ల ఈ సంస్థలో వీళ్ళలాగా ఎవరు బిహేవ్ చేయలేదని సీ కళ్యాణ్ అన్నాడు. తమకు ఎలాంటి పదవి వ్యామోహం లేదని, అందుకే ఎలక్షన్ తేదీని ప్రకటిస్తున్నామని తెలిపాడు. తాను ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదని చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు జరుగుతాయని, 6 వ తేదీ వరకు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుందని, 13వ తేదీ వరకు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపాడు.
తమ కౌన్సిల్‌లో ప్రస్తుతం 9 కోట్ల ఫండ్ ఉందని, అంత మొత్తంలో పోగవ్వడానికి కారణం దాసరి నారాయణ రావు అని గుర్తు చేసుకున్నాడు. సినిమా పరిశ్రమపై ప్రభుత్వాల తీరును గురించి ప్రస్తావిస్తూ, ఆంధ్రా కి సినిమా పరిశ్రమ వెళ్తుందని తాను అనుకోవట్లేదని అన్నాడు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఒరిగేదేమీ లేదని సి కళ్యాణ్ పెదవి విరిచాడు.
Also Read: Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?
Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook