NBK 108 Movie: బాలయ్య సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ?

NBK 108 Movie: వయస్సు మీదపడినా..ఇప్పటికీ యువ హీరోలతో సమానంగా దూసుకుపోతున్నాడు బాలయ్య. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న బాలయ్య 108వ సినిమాకు బాలీవుడ్ భామ సిద్ధమైనట్టు సమాచారం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 4, 2022, 08:25 PM IST
NBK 108 Movie: బాలయ్య సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ?

అఖండ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఇక బాలయ్యకు అడ్డులేకుండా పోయింది. యువ హీరోలతో సమానంగా వరుస సినిమాలు చేస్తూ అభిమానులకు దబిడి దిబిడే అంటున్నాడు. ఈసారి తెరకెక్కనున్న సినిమాకు బాలయ్య సరసన బాలీవుడ్ భామ సైన్ చేసినట్టుగా వస్తున్న వార్తల్లో నిజమెంతో చూద్దాం.

టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ వయస్సు ఆరుపదులు దాటినా..ఇంకా 3-4 పదుల వయస్సులానే ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటున్నాడు. ఓ వైపు సినిమాలు మరోవైపు ఆహాలో అన్ స్టాపబుల్ అంటూ స్టాప్ లేకుండా పరుగెడుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేనితో వీరసింహారెడ్డి సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. మరోవైపు అనిల్ రావిపూడి తెరెకెక్కిస్తున్న బాలయ్య 108వ సినిమాపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా షూటింగ్ ప్రారంభం కాని ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఎంపికైనట్టుగా ప్రచారం జోరుగా విన్పిస్తోంది. అయితే సోనాక్షి సినిమా ఈ వార్తలు నిజం కాదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖండించింది.

బాలయ్య 108వ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. గోపీచంద్ మలినేని తీస్తున్న వీరసింహారెడ్డి సినిమా అనంతరం  బాలయ్య 108వ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయి.

Also read: Bandla Ganesh on Allu Bobby: తండ్రి మాట వింటే బాబీ అవుతారు, వినకుంటే బన్నీ అవుతారట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News