Mansi Taxak: యానిమల్ సినిమాలో బాబీ డియోల్ మూడో భార్య.. రియల్ లైఫ్ లో ఎలా ఉందంటే..?

Bobby Deol's Third Wife In Animal: గత కొద్ది రోజుల నుంచి అన్ని భాషలలోనూ యానిమల్ మానియా నడుస్తోంది. ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కూడా యానిమల్ సినిమాకి సంబంధించిన రీల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బాబీ డియోల్ మూడో భార్య గా చేసింది ఎవరు అని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు నెటిజెన్స్..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2023, 09:57 PM IST
Mansi Taxak: యానిమల్ సినిమాలో బాబీ డియోల్ మూడో భార్య.. రియల్ లైఫ్ లో ఎలా ఉందంటే..?

Mansi Taxak: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు మార్క్ అందుకొని ఇంకా కూడా జోరు తగ్గకుండా కొనసాగుతోంది. ఈ సినిమాలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం ఒక ప్లస్ పాయింట్ అయితే.. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్స్ కోసం సెలెక్ట్ చేసుకున్న నటీనటులు మరో హైలెట్ గా నిలిచారు. 

ముఖ్యంగా ఈ చిత్రంలో కనిపించిన హీరోయిన్స్ యువతను ఎక్కువగా ఆకట్టుకున్నారు. ముందుగా రష్మిక ఎప్పుడు లేనంత పర్ఫామెన్స్ ఉన్న పాత్రలో నటించి అందరినీ నటించింది. మరోపక్క త్రిప్తి డిమ్రి ప్రస్తుతం అబ్బాయిలకి క్రష్ గా మారిపోయింది. అయితే వీరిద్దరి కన్నా కూడా ఇంకో అమ్మాయి అనుకోకుండా యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కొన్నిసార్లు సినిమాలో యాక్ట్ చేసిన లీడ్ క్యారెక్టర్ల కంటే కూడా సపోర్టింగ్ రోల్స్ చేసిన వారికే ఎక్కువ అటెన్షన్ లభిస్తూ ఉంటుంది.  కాగా ఇప్పుడు యానిమల్ సినిమాలో కూడా అదే జరిగింది.

  యాక్టింగ్ పరంగా యానిమల్ సినిమా వల్ల రష్మిక మందన్నాకు ఎంతో క్రేజ్ వచ్చింది. కానీ, జోయా క్యారెక్టర్- అబ్రార్ మూడో భార్యలకు యువత మదిలో ప్రత్యేక స్థానం వచ్చేసింది. ఇప్పటికే జోయా పాత్ర చేసిన తృప్తి ధిమ్రీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు అందరూ విలన్ బాబీ డియోల్ మూడో భార్యపై ఫోకస్ పెట్టారు. పెద్దగా సీన్స్ లేకపోయినా ఉన్న కొన్ని సీన్స్ లో తన అమాయకపు చూపులతో చాలా ఆకట్టుకున్న ఈ నటి ఎవరు అని తెగ వెతకడం ప్రారంభించారు. ఆమె గురించే వరుస మీమ్స్, సోషల్ మీడియా పోస్టులు రావడంతో.. ఒక్కసారిగా అందరి చూపు ఇప్పుడు ఆమెపై పడింది. ఇంతకు ఆమె పేరు ఏమిటి అంటే-మాన్సీ తక్షక్ .

నిజానికి రియల్ లైఫ్ లో మాన్సీ తక్షక్ ఎవరు అనే విషయం చాలామందికి తెలియదు.  ఈ మధ్య షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాలో కూడా మానసికనిపించడం విశేషం. అయితే ఆ చిత్రం వల్ల ఆమెకు పెద్దగా గుర్తింపు లభించలేదు. కానీ, యానిమల్ సినిమాలో మాత్రం దొరికింది చాలా చిన్న పాత్ర అయినా కూడా ప్రేక్షకుల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించేసింది. నెట్టింట ఇప్పుడు అందరూ మాన్సీ తక్షక్ గురించే మాట్లాడుతున్నారు. ఇక క్లైమాక్స్ చూసినవారు  పార్ట్ 1లో పాత్ర లిమిటెడ్ గా ఉన్నా కూడా.. పార్ట్ 2లో కూడా మాన్సీ క్యారెక్టర్ కొనసాగే విధంగానే ఉంది అని కాబట్టి ఆ చిత్రంలో ఈమె నుంచి ఎక్కువ ఆశించవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. 

ఇక ఈ సినిమా కాకుండా మాన్సీ కి మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయో తెలియాలి అంటే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి. ప్రస్తుతానికి ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. కాబట్టి దీనివల్ల రాబోయే కాలంలో ఏమని ఎక్కువ మంది చిత్రాల నిర్మాతలు సంప్రదించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

Also Read:  New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..

Also Read:  CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News