Manchu Family : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకున్న మంచు ఫ్యామిలీలో అనూహ్యంగా గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒకే తల్లి పిల్లలైన అన్నదమ్ముల మధ్య గొడవలు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. ఈ సన్నివేశం సినిమాను తలపిస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
నిన్న ఉదయం మంచు మనోజ్ , మోహన్ బాబు మధ్య గొడవలు జరగగా.. మంచు మోహన్ బాబు విద్యాసంస్థలలో కీలకంగా పనిచేసే వినయ్ తనపై దాడి చేసి గాయపరిచారు అని డయల్ 100 కి మంచు మనోజ్ ఫోన్ చేశారు. ఇక తర్వాత గాయాలతో ఆయన హాస్పిటల్ కి చేరుకోగా.. చికిత్స అనంతరం హైదరాబాదులో జల్ పల్లి లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు.
ఇకపోతే తాజాగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు. విష్ణు తరుఫున 40 మంది బౌన్సర్లు రాగా.. పోటీగా మంచు మనోజ్ కూడా 30 మంది ప్రైవేట్ బౌన్సర్లను తెప్పించారు. కానీ మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్న.. సెక్యూరిటీ మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలికి అనుమతించడం లేదు అని సమాచారం.కాగా కాసేపట్లో దుబాయ్ నుంచి మంచు విష్ణు హైదరాబాదుకు చేరుకొని తన తండ్రి ఇంటికి రాబోతున్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇకపోతే విష్ణు వచ్చాక ఇక్కడ పెద్ద గొడవ జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న..నేపథ్యంలో ఇప్పటికే ముంబై నుండి మోహన్ బాబు నివాసానికి మంచు లక్ష్మి చేరుకుంది అని తెలుస్తోంది.
ఈ క్రమంలో విష్ణు టిమ్..మాత్రం ఈ వార్తలను కొట్టివేస్తున్నారు. మంచు విష్ణు ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారని..ఆయను ఈరోజు హైదరాబాదు వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని..మంచు విష్ణు స్వయనా వివరాలను అధికారికంగా ప్రకటించేవరకు ఎలాంటి వార్తలను నమ్మవద్దు.. అని వారు కోరారు.
ఇకపోతే మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవలు ఎందుకు మొదలయ్యాయి అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. కానీ మనోజ్ మాత్రం తన తండ్రి అలాగే వినయ్ పైన పోలీస్ కంప్లైంట్.. ఇచ్చినట్లు వార్తలు గట్టిగా వినిపించాయి. మొత్తానికి వీటి పైన క్లారిటీ రావాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే.
ఇదీ చదవండి: ఇందిరా దేవి మిస్సింగ్.. కావ్యకు షాకింగ్ న్యూస్ చెప్పిన కల్యాణ్, ఎస్సై ట్రైనింగ్‌లో అప్పు అలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.