Bheemla Nayak OTT: థియేటర్లలో 'భీమ్లానాయక్' .. ఓటీటీలో ఎప్పుడంటే..??

Bheemla Nayak OTT: భీమ్లా నాయక్ సినిమా నేడు థియేటర్లలో విడుదలై.. హిట్​ టాక్​ తెచ్చుకుంది. అప్పుడే ఓటీటీలో సినిమా విడుదలపై అంచనాలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2022, 01:56 PM IST
  • ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భీమ్లా నాయక్ విడుదల
  • థియేటర్ల వద్ద పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సందడి
  • ఓటీటీ రిలీజ్​పై అప్​డేట్​
Bheemla Nayak OTT: థియేటర్లలో 'భీమ్లానాయక్' .. ఓటీటీలో ఎప్పుడంటే..??

Bheemla Nayak OTT: పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్​, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన 'భీమ్లా నాయక్' సినిమా​ ప్రపంచవ్యాప్తంగా నేడు థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న పవన్ కల్యాణ్​ ఫ్యాన్స్​ థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ సినిమా గురించే చర్చ సాగుతోంది.

కొంతమంది ఫ్యాన్స్ టికెట్లకోసం నానా ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొందరేమో బ్యాక్​​ టూ బ్యాక్​ షోలు చూస్తున్నారు. ఫ్యాన్స్​తో పాటు క్రిటిక్స్​ కూడా ఈ సినిమాకు మంచి మార్కులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. థియేటర్లు నిండిపోతున్నాయి. రీమేక్​ మూవీ అయినప్పటికీ.. అంచనాలకు మించి సినిమా ఉన్నట్లు అభిమానులు చెబుతున్నారు.

థియేటర్లలో భీమ్లా నాయక్ సందడి నడుస్తుండగానే..  మరోవైపు ఓటీటీలోఈ సినిమా రిలీజ్ అవుతుందనే విషయంపై చర్చ సాగుతోంది. ఇప్పటికే ఓటీటీ ప్లాట్​ఫామ్​తో భీమ్లానాయక్​ నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.

ఎందులో రానుంది?

ఆహా ఓటీటీ తెలుగు రైట్స్​ను అహా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం మార్చి చివరి వారంలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయొచ్చని సమాచారం. ఇక భీమ్లా నాయక్ డబ్బింగ్ వెర్షన్​ను 'డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​' దక్కించుకున్నట్లు టాక్ నడుస్తోంది.

తెలుగు ఒరిజినల్​తో పాటు.. హీందీ డబ్బింగ్ వెర్షన్​కు భారీ ధర చెల్లించినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేవలం ఓటీటీలు, శాటిలైట్స్​ ద్వారానే రూ.70 లాభాన్ని గడిస్తుందని అంచనాలు ఉన్నాయి.

ఇక థియేటర్లలో భీమ్లా నాయక్ కలెక్షన్స్​ కలెక్షన్ల వర్షం కురిపించనున్నట్లు థియేటర్ల వద్ద సందడి చూస్తే అర్థమవుతోంది. మొత్తం మీద భీమ్లా నాయక్ మూవీ నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also read: Bheemla Nayak Review: భీమ్లా నాయ‌క్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Also read: Bheemla Nayak Movie: మొదలైన 'భీమ్లా నాయక్‌' సందడి.. థియేటర్ల వద్ద పవన్ ఫాన్స్ హంగామా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News