‘భరత్ అనే నేను’ రిలీజ్ డేట్ ఫిక్స్

Last Updated : Oct 27, 2017, 03:36 PM IST
‘భరత్ అనే నేను’ రిలీజ్ డేట్ ఫిక్స్

మహేష్ బాబు హీరాగా నటిస్తున్న ‘భరత్ అనే నేను’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మూవీ కూడా స్పైడర్ సినిమా మారిగా సూపట్ హిట్ కొట్టుతోందని చిత్ర నిర్మాత దానయ్య చెబుతున్నారు. కాగా ఈ మూవీ ఘూటింగ్  ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్‌ 7 వరకు హైదరాబాద్‌ లోనూ... నవంబర్‌ 22 నుంచి ఔట్‌ డోర్‌ షెడ్యూల్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు.  శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై  ‘భరత్ అనే నేను’  తెరపైకి రానుంది. 

చిత్ర యునిట్...

కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌ తో పాటు ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. కాతా చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ఫైట్స్‌ మాస్టర్ గా పీటర్‌ హెయిన్‌, సినిమాటోగ్రఫీగా రవి కె.చంద్రన్‌ ఉన్నారు.

 

Trending News