RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీలో మార్పు లేదా..అక్టోబర్ 13నే విడుదలా

RRR Movie Release Date: మొత్తం తెలుగు సినీ పరిశ్రమ దృష్టి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఉంది. కరోనా ఇబ్బందికర పరిస్థితుల నేపధ్యంలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో విడుదల తేదీపై కీలక విషయం బయటికొచ్చింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 4, 2021, 06:38 PM IST
 RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీలో మార్పు లేదా..అక్టోబర్ 13నే విడుదలా

RRR Movie Release Date: మొత్తం తెలుగు సినీ పరిశ్రమ దృష్టి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఉంది. కరోనా ఇబ్బందికర పరిస్థితుల నేపధ్యంలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో విడుదల తేదీపై కీలక విషయం బయటికొచ్చింది.

బాహుబలి (Bahubali)తరువాత టాలీవుడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న మరీ భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie). ఈ సినిమా విడుదల ఎప్పుడా అని మొత్తం టాలీవుడ్ ఎదురు చూస్తోంది. 2020 నుంచి ఇప్పటి వరకూ అంటే దాదాపు ఏడాదన్నరగా చాలా సినిమాలు కరోనా సంక్షోభంలో మునిగిపోయాయి. రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా చాలా సందేహాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయాలని రాజమౌళి గతంలోనే అంటే కరోనా సెకండ్ వేవ్‌కు ముందే ప్రకటించారు. ఆ తరువాత కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) కారణంగా లాక్‌డౌన్ (Lockdown) ప్రకటించడం, షూటింగ్‌లు తిరిగి నిలిచిపోవడంతో విడుదల తేదీపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే రాజమౌళి గానీ..చిత్ర యూనిట్ గానీ విడుదల తేదీ అక్టోబర్ 13నే ఉంటుందనే ధీమాలో ఉన్నారు. 

రాజమౌళి (Rajamouli) సోదరుడు, సంగీత దర్శకుడైన ఎంఎం కీరవాణికు.. ఇవాళ అతని పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ యూనిట్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ అక్టోబర్ 13 అని ట్వీట్ ద్వారా చెప్పడంతో విడుదల తేదీపై నెలకొన్న సస్పెన్స్ దాదాపుగా తొలగిపోయింది. ఏదేమైనా ముందుగా అనుకున్న తేదీకే సినిమా విడుదల చేసేందుకు రాజమౌళి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. 

Also read : Aamir Khan And Kiran Rao Divorce: ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ నుంచి అర్బాజ్, మలైకా అరోరా వరకు బాలీవుడ్‌లో షాకింగ్‌ విడాకులు ఇవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News