Theatre Rates New GO: ధియేటర్ రేట్లపై ఏపీ ప్రభుత్వ జీవోతో నష్టాలంటున్న ధియేటర్ యజమానులు

Theatre Rates New GO: కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ అనంతరం గాడిన పడుతున్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో నిరాశ మిగుల్చుతోంది. సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచడాన్ని ప్రభుత్వం నిరాకరించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 14, 2021, 05:17 PM IST
Theatre Rates New GO: ధియేటర్ రేట్లపై ఏపీ ప్రభుత్వ జీవోతో నష్టాలంటున్న ధియేటర్ యజమానులు

Theatre Rates New GO: కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ అనంతరం గాడిన పడుతున్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో నిరాశ మిగుల్చుతోంది. సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచడాన్ని ప్రభుత్వం నిరాకరించింది.

లాక్‌డౌన్ (Lockdown)అనంతరం ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమ కోలుకుంటోంది. సినిమాలు ధియేటర్లలో విడుదలై..జనం కూడా థియోటర్లకు వస్తున్నారు. ఈ క్రమంలో  ముఖ్యంగా పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు భారీగా టికెట్లు పెంచుకోవడం టాలీవుడ్‌( Tollywood)లో ఓ అలవాటుగా మారింది. వకీల్ సాబ్ సినిమాతో ఈ ప్రక్రియకు చెక్ పలికింది ప్రభుత్వం. కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ఇష్టారాజ్యంగా టికెట్లు పెంచుకోవడాన్ని ప్రభుత్వం నిరాకరించింది. అటు హైకోర్టు కూడా టికెట్లు పెంచడాన్ని అనుమతించలేదు. ప్రభుత్వం ఏకంగా కొత్తగా జీవో తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం కొత్త సినిమాలు విడుదలైనప్పుడు కూడా టికెట్లు పెంచుకోకూడదు. 

ప్రభుత్వం (Ap government) తీసుకున్న నిర్ణయంతో ధియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు నిరాశకు లోనయ్యారు. సినిమాలు విడుదలై..టికెట్లు పెంచుకుని నష్టాన్ని పూడ్చుకోవాలని భావించిన పరిశ్రమ వర్గాలు ప్రభుత్వ నిర్ణయంతో షాక్ తిన్నాయి. వకీల్ సాబ్ సినిమా( Vakeel saab movie) తో టిక్కెట్లు పెంచుకునే పద్ధతికి స్వస్తి పలికింది ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో ప్రకారం టికెట్లు అమ్ముకుంటే నష్టాలెదురవుతాయంటున్నారు థియేటర్ యజమానులు. ప్రస్తుతం గ్రామ పంచాయితీల్లో ఏసీ థియేటర్లలో టికెట్ రేట్లు 20.15,10 రూపాయలుగా ఉండగా..నాన్ ఏసీ థియేటర్లలో 15, 10, 5 రూపాయలుగా ఉన్నాయి. నగర పంచాయితీల్లో అయితే థియేటర్ టికెట్ అత్యధిక ధర 35 రూపాయలు మాత్రమే. మున్సిపాలిటీల్లో అత్యధిక రేటు 70 రూపాయలు మించకూడదని జీవోలో ఉంది. 

Also read: Jr Ntr movie: జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివతోనే..విడుదల తేదీ కూడా ఖరారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News