AP Poice: చంద్రబాబు సినీ పరిశ్రమ టార్గెట్‌.. త్వరలోనే పోసాని, శ్రీరెడ్డి, రామ్‌ గోపాల్‌ వర్మ అరెస్ట్‌?

Very Soon Ram Gopal Varma Srireddy And Posani Krishna Murali Arrest: అటు రాజకీయంగా.. ఇటు సినీ ప్రముఖులపై కూడా కూటమి ప్రభుత్వం అణచివేసే ప్రయత్నాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే ముగ్గురి అరెస్ట్‌ ఉంటుందనే చర్చ కలకలం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 18, 2024, 04:28 PM IST
AP Poice: చంద్రబాబు సినీ పరిశ్రమ టార్గెట్‌.. త్వరలోనే పోసాని, శ్రీరెడ్డి, రామ్‌ గోపాల్‌ వర్మ అరెస్ట్‌?

Ram Gopal Varma Arrest: ఆంధ్రప్రదేశ్‌లో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పక తప్పదు. ఒకవైపు రాజకీయ అరెస్ట్‌లు కొనసాగుతుండగా.. మరోవైపు రాజకీయంగా తమకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సినీ ప్రముఖులపై కూడా కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్‌లలో సినీ ప్రముఖులపై కేసులు నమోదవుతుండగా.. న్యాయస్థానాల్లో కూడా వారికి ఎదురుదెబ్బ తగులుతోంది. త్వరలోనే సినీ పరిశ్రమ నుంచి భారీ అరెస్ట్‌లు ఉంటాయని తెలుస్తోంది.

Also Read: RK Roja: మళ్లీ ఫామ్‌లోకి ఆర్‌కే రోజా.. సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన మాజీమంత్రి

ఎన్నికలు, రాజకీయ పరిణామాలపై తరచుగా సినీ ప్రముఖులు పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, రామ్‌ గోపాల్‌ వర్మ వ్యాఖ్యలు చేశారు. తరచూ రాజకీయాలు మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తోపాటు నాయకులపై విరుచుకుపడుతున్న వారి పని పట్టే పనిలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఉన్నారు. ఇప్పటికే చాలా పోలీస్‌ స్టేషన్‌లలో ఆ ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. అరెస్ట్‌ కాకుండా ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసిన రామ్‌గోపాల్‌ వర్మకు భారీ షాక్‌ తగిలింది. న్యాయస్థానం తాము స్పందించలేమని ప్రకటించడం చూస్తుంటే త్వరలోనే ఆర్జీవీతోపాటు శ్రీరెడ్డి, పోసాని అరెస్ట్‌లు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: AP POLITICS: చంద్రబాబు దెబ్బకు.. చెన్నైకి మకాం మార్చిన వైసీపీ లీడర్‌

ఎన్నికలకు ముందు 'వ్యూహం' చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించి విడుదల చేసిన విషయం లిసిందే. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను విమర్శిస్తూ ఆర్జీవీ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టారు. ఆ ఇద్దరిపై సినిమాలో వారిని కించపరిచేలా సన్నివేశాలు తీశారు. డైరెక్టర్‌ వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నాయకుడు రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలంటూ హైదరాబాద్‌లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం మంగళవారం వర్మ పోలీసు విచారణకు వెళ్లాల్సి ఉండగా ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. 

అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. అతడి పిటిషన్‌ను సోమవారం విచారించిన హైకోర్ అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని కోర్టు తెలపడంతో వర్మ ఖంగుతిన్నారు. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించడం గమనార్హం. మంగళవారం పోలీసు విచారణకు హాజరు కావాలని ఆదేశించడం కలకలం రేపుతోంది.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను దూషించిన పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిని కూడా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వారిపై వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. వారికి త్వరలోనే నోటీసులు ఇచ్చి అరెస్ట చేసే అవకాశం ఉంది. రాజకీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వీరి అరెస్ట్‌తో సినీ పరిశ్రమలో కలకలం రేపే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అరెస్ట్‌ తప్పదనే హెచ్చరిక ఏపీ ప్రభుత్వం ఇస్తోందని అర్థమవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter 

Trending News