Bhagavanth Kesari
సినిమా అంటే హీరో హీరోయిన్ మధ్య పాటలు, ఐటెం సాంగ్స్, ఒక రెండు మూడు ఫైట్లు, అనుకునే కాలం పోయింది. ఒకప్పుడు అవన్నీ ఉంటేనే సూపర్ హిట్ అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు కాలం మారింది. కథ బాగుంటే చాలు ఇవేవీ లేకపోయినా ప్రేక్షకులు ఆ సినిమాలను సూపర్ హిట్ చేస్తున్నారు. ఫైట్స్ ఉన్నాయా లేవా అసలు సాంగ్స్ ఉన్నాయా లేవా అనే సంగతి కూడా చూడడం ఈ నేపథ్యంలో కొంచెం ఇలానే ప్రేమ కథలు అలానే సాంగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం కథ పైన కాన్సన్ట్రేట్ చేసి అనిల్ రావిపూడి తీసిన సినిమా భగవంత్ కేసరి.
బాలకృష్ణ లాంటి సీనియర్ మాస్ హీరోని పెట్టుకున్న కానీ అనిల్ రావిపూడి ఎక్కడ తను రాసుకున్న కథ గీత దాత లేదు. కాజల్ లాంటి హీరోయిన్ పెట్టుకున్న కావాలని సినిమాలో డ్యూయెట్లు పెట్టలేదు. ఎమోషన్స్ పైన అలానే కథలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ సినిమాని చక్కగా తీశారు ఈ డైరెక్టర్.
ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక క్రిటిక్ రాసిన దాని గురించి అనిల్ రావిపూడి అన్న మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
అక్టోబర్ 19 విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా మేకర్స్ హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో నిర్మాత సాహు గారపాటి, దర్శకుడు అనిల్ రావిపూడి, నటి శ్రీలీల తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఒక జర్నలిస్ట్ నెగిటివ్ రివ్యూ గురించి ప్రస్తావించగా దానికి సెన్సేషనల్ ఆన్సర్ ఇచ్చారు ఈ డైరెక్టర్.
బహుశా ఆయన శ్రీలీల ఫ్యాను లేక శ్రీలీల డాన్సులు చేయాలని కోరుకున్నాడేమో నాకు తెలియదు. ఒక తండ్రి కూతురిని, ఒక ఫోబియాతో బాధపడుతున్న ఒక ఆడపిల్లని, ఒక షేర్‌లా పెంచాలనుకున్న అమ్మాయిని కూడా డాన్సులు, పాటల్లో చూడాలనుకున్నట్టు రాశారు. దీన్ని బట్టి అతని మానసిక స్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవాలి. అంటే అతను సినిమాకెల్లే మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సినిమా స్టార్ట్ అయ్యాక శ్రీలీల డాన్సులు గురించి ఆయన ఆలోచించారు అంటే అతని మానసిక స్థితి ఎలా ఉందో అతనికే వదిలేస్తున్నా. మనం ఎలా చెప్పాం.. ఆ అమ్మాయికి ఒక ఫోబియా ఉంది, అమ్మాయిని ఇండియన్ ఆర్మీకి పంపుతున్నాం. ఆర్మీకి వెళ్తున్న అమ్మాయితో కూడా డాన్సులు వేయించాలనే ఆయన ఆలోచన ఎంతో అసలు ఆయన మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఎవరు రాశారో ఆ వ్యక్తి నాకు తెలుసు. ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకపోవడం మంచిది' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ డైరెక్టర్.
కాగా అనిల్ రావిపూడి అన్న ఈ మాటలను అనేకమంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లల గురించి మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాలో డాన్సుల గురించి ఆలోచిస్తూ నెగిటివ్ రివ్యూ రాసిన వాళ్లకి అనిల్ రావిపూడి మాటలే కరెక్ట్ అని తెలియజేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు, ఏపీలో ఇక వర్షాలు
ఇది కూడా చదవండి: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా గిఫ్ట్.. డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook