Anchor Rashmi Gautam : యాంకర్ రష్మీ ఇంట్లో విషాదం.. జ్ఞాపకాలు ఎప్పుడూ మాతోనే.. ఎమోషనల్ పోస్ట్

Anchor Rashmi Gautam Grand mother యాంకర్ రష్మీ ఇంట్లో విషాదం నెలకొంది. తన అమ్మమ్మ మరణించడంతో రష్మీ ఎమోషనల్ అయింది. అమ్మమ్మతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ కన్నీరుమున్నీరైంది. అయితే ఈ మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 11:20 AM IST
  • యాంకర్ రష్మీ ఇంట్లో విషాదం
  • అమ్మమ్మ మృతిపై రష్మీ గౌతమ్ ఎమోషనల్
  • మా ఎంతో ప్రభావం ఉండేదంటూ పోస్ట్
Anchor Rashmi Gautam : యాంకర్ రష్మీ ఇంట్లో విషాదం.. జ్ఞాపకాలు ఎప్పుడూ మాతోనే.. ఎమోషనల్ పోస్ట్

Anchor Rashmi Gautam Grand mother pramila mishra Passes Away యాంకర్ రష్మీ తన అమ్మమ్మ ప్రమీలా మిశ్రా మరణంతో కుంగిపోయింది. తన అమ్మమ్మ చనిపోయిందంటూ ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేసింది. ఈ రోజు మాకు ఎంతో దుర్దినం.. మా కుటుంబం అంతా కూడా గ్రాండ్ మదర్, స్ట్రాంగ్ మహిళ అయిన ప్రమీళా మిశ్రాకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పాం.. మా మీద ఆవిడ ఎంతో ప్రభావం చూపించింది.. మా మధ్య ఆమె లేకపోయినా కూడా జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ మాతోనే ఉంటాయి అంటూ రష్మీ ఎమోషనల్ అయింది.

రష్మీ ఫ్యామిలీ విషయాలు ఎక్కువగా బయటకు రావు. కొన్ని సార్లు స్టేజ్ మీదే ఎమోషనల్ అవుతూ.. తాను సింగిల్ పేరెంట్ అని, అమ్మే కష్టపడి పెంచిందని, నాన్న వదిలేశాడంటూ ఇలా చెబుతూ అందరినీ ఏడిపించేసింది. అయితే ఇప్పుడు తన అమ్మమ్మ మరణించిందని చెప్పి అందరినీ కదిలించింది. రష్మీ తన అమ్మతో కలిసి వైజాగ్‌లో ఉంటుందన్న సంగతి తెలిసిందే.

యాంకర్ రష్మీ పర్సనల్ విషయాల మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆల్రెడీ రష్మీకి ఇది వరకు పెళ్లి అయిందని, విడాకులు కూడా జరిగాయనే రూమర్లు కూడా వస్తుంటాయి. కానీ రష్మీ ఏనాడూ రూమర్ల మీద స్పందించలేదు. ఇలా రష్మీ వ్యక్తిగత జీవితం మీద ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలనూ రష్మీ పెళ్లి గురించే టాపిక్ నడిచింది. ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పు అని స్టేజ్ మీదే అడిగేశారు. రష్మీ ఆ విషయానికి ఏదో సిగ్గు పడుతూ నాన్చుతూ ఏదో చెప్పబోయింది. కానీ రష్మీ పెళ్లి మీద ఎవ్వరికీ అంతగా నమ్మకం లేదు. ఎప్పుడు చేసుకుంటుంది? ఎవరిని చేసుకుంటుంది? అనే విషయం మీద కూడా జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపించడం లేదు.

Also Read:  Pathaan Advance Booking : పఠాన్ మేనియా.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే.. కింగ్ ఖాన్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టేనా?

Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News