Anasuya Bharadwaj Photoshoot: మత్తేక్కించే చూపులతో కట్టిపడేస్తున్న యాంకర్ అనసూయ

Anasuya Bharadwaj Photoshoot: బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్. బుల్లితెరపై జబర్దస్త్ షో యాంకర్‌గా రాణిస్తున్న ఈ భామ.. ఇటీవలే 'పుష్ప' సినిమాలో దాక్షాయని పాత్రలో మెప్పించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. తరచూ ఫొటోలనూ షేర్ చేస్తుంటుంది. తాజాగా మోడ్రన్ డ్రస్సులో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 12:57 PM IST
    • యాంకర్ అనసూయ భరద్వాజ్ కొత్త ఫొటోషూట్ వైరల్
    • మోడ్రన్ డ్రస్సులో కనుచూపుతో మనసులు కొల్లగొడుతున్న భామ
    • సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనసూయ భరద్వాజ్
Anasuya Bharadwaj Photoshoot: మత్తేక్కించే చూపులతో కట్టిపడేస్తున్న యాంకర్ అనసూయ

Anasuya Bharadwaj Photoshoot: ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన యాంకర్ అనసూయ భరద్వాజ్.. కొద్దికాలంలో తన అందంతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పొట్టి పొట్టి బట్టలతో పాటు మోడ్రన్ డ్రస్సులతో కుర్రకారును ఆకర్షించింది. అప్పుడప్పుడు సంప్రదాయ దుస్తుల్లోనూ మెరుస్తున్న ఈ సుందరి తాజాగా మరో ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. 

గురువారం (ఫిబ్రవరి 3) ప్రసారంకానున్న జబర్దస్త్ కార్యక్రమం సందర్భంగా యాంకర్ అనసూయ చేసిన ఫొటోషూట్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మోడ్రన్ డ్రస్సులో ఆకట్టుకునే హావభావాలతో అలరించింది. ప్రతివారం ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో వెరైటీ డ్రస్సులలో అలరిస్తోంది అనసూయ. 

అనసూయ.. ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అనసూయ ఇప్పటికే పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించింది. 'క్షణం', 'రంగస్థలం' చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 

'క్షణం'లో పోలీస్ అధికారిగా.. 'రంగస్థలం'లో గృహిణిగా తన నటనతో మెస్మరైజ్ చేసారు. ఇటీవలే 'పుష్ప' సినిమాలో నెగెటివ్ రోల్ పోషించి.. తన నటనతో అందర్ని ఆకట్టుకుంది. ఇప్పుడు 'పుష్ప ది రూల్' సినిమాలో అనసూయ పాత్ర బీభత్సంగా ఉంటుందని టాలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

Also Read: Pooja Hegde Photos: సంప్రదాయ దుస్తుల్లో ఎంత ముద్దుగున్నావే బుట్టబొమ్మ!

Also Read: Ketika Sharma Photos: గ్లామర్ డోస్ పెంచేసిన 'రొమాంటిక్' బ్యూటీ కేతికా శర్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News