Allu Arjun: అభిమానితో ఫొటోలు దిగిన పుష్పరాజ్‌

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా ‘పుష్ప’ ( Pushpa ) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలనే మొదలైంది.

Last Updated : Nov 16, 2020, 01:30 PM IST
Allu Arjun: అభిమానితో ఫొటోలు దిగిన పుష్పరాజ్‌

Allu Arjun photos viral on social media: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా ‘పుష్ప’ ( Pushpa ) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలనే మొదలైంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్‌ను వేగంగా చిత్రీకరిస్తున్నారు మూవీమేకర్స్. ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఎంతగా బిజీబిజీగా ఉంటాడో మనం చెప్పాల్సిన పనిలేదు. ఇంత బిజీలో కూడా తన దగ్గరకు వచ్చిన అభిమానితో ముచ్చటించి.. బన్నీ ఫొటోలు సైతం దిగాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ హెయిర్ స్టైల్‌ను చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. Also read: Ananya Panday: న్యూ స్టిల్స్‌తో మైమరిపిస్తున్న ‘ఫైటర్’ బ్యూటీ అనన్య

Allu Arjun photos with fan

ఈ సినిమాను దర్శకుడు సుకుమార్.. ఎర్రచందనం అక్రమ రవాణా కథాంశంతో తెరకెక్కించబోతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించనుంది. అయితే ఈ సినిమాలో బ‌న్నీ స్మగ్లర్‌గా.. రష్మిక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. అయితే  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏపీలోని మారేడుపల్లి అడవిలో జరుగుతోంది.

Allu Arjun photos with fan

Also read: Seerat kapoor: సీరత్ కపూర్ స్టన్నింగ్ ఫొటోలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News