Allu Arjun: ‘పుష్ప’ షూటింగ్‌కు వచ్చేస్తున్నాడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా ‘పుష్ప’ ( Pushpa ) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయింది. అన్‌లాక్ నాటినుంచి చాలా సినిమాలు షూటింగ్‌లు మొదలయ్యాయి. అయితే పుష్ప సినిమా అప్డేట్ గురించి రాకపోవడంతో.. అల్లు అర్జున్ అభిమానులు నిరాశతో ఎదురుచూస్తున్నారు.

Last Updated : Nov 9, 2020, 02:02 PM IST
Allu Arjun: ‘పుష్ప’ షూటింగ్‌కు వచ్చేస్తున్నాడు

Allu Arjun ‘Pushpa’ Movie Update: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా ‘పుష్ప’ ( Pushpa ) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయింది. అన్‌లాక్ నాటినుంచి చాలా సినిమాలు షూటింగ్‌లు మొదలయ్యాయి. అయితే పుష్ప సినిమా అప్డేట్ గురించి రాకపోవడంతో.. అల్లు అర్జున్ అభిమానులు నిరాశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి సరికొత్త అప్డేట్ వచ్చేసింది. రేపటినుంచి (నవంబరు 10) ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోమవారం ప్రకటించారు. 

ఈ సందర్భంగా మూవీ మేకర్స్ అభిమానుల కోసం స్పెషల్ గ్లిమ్స్‌ను ట్విట్టర్ వేదిక ద్వారా పంచుకున్నారు. దీనిలో ప్రీ ప్రొడెక్షన్ వర్క్ గురించి ఈ ప్రత్యేక వీడియోలో మూవీ మేకర్స్ చూపించారు. ఈ వీడియో అల్లు అర్జున్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే రేపటినుంచి తెలుగు రాష్ట్రాల్లోని అటవీప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. Also read: Pushpa villain: పుష్ప విలన్‌గా బాలీవుడ్ నటుడు

ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్.. ఎర్రచందనం అక్రమ రవాణా కథాంశంతో.. చిత్తూరు పరిసరాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించనుంది. అయితే ఈ సినిమాలో బ‌న్నీ లారీ డ్రైవర్‌గా..  రష్మిక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నారు. Also read: Chiranjeevi: మెగాస్టార్‌కు కరోనా పాజిటివ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News