Metro Rail: మెట్రోలో రోజు ప్రయాణించే పాసింజిర్స్ కోసం మెట్రో రైలును నడిపే ఎల్ అండ్ టీ శుభవార్త చెప్పింది. మెట్రో రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేక ధరలతో ఫస్ట్ అండ్ లాస్ట్ రైలు కనెక్టివిటీని మెరుగుపరుచుకునేందుకు ర్యాపిడూ ను భాగస్వామం చేసింది.
Metro Rail: హైద్రాబాద్ లో మెట్రో రైలు గత నెల 22తో 7 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ యేడేళ్లలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించింది. అంతేకాదు ఈ ఏడేళ్లలో 50 కోట్ల ప్రయాణికులు హైదరాబాద్ మెట్రీలో ప్రయాణించారు. ప్రతి రోజూ సగటున 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైలులో తమ గమ్యస్థానాన్ని చేరుకుంటున్నారు.
హైదరాబాద్ నగరంలో 57 మెట్రో స్టేషన్లలో దేనికైనా ప్రయాణించే పాసింజిర్స్ కు కేవలం రూ. 30 నుండి చార్జీలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాదిలోనే రాపిడో 10 మిలియన్లకు పైగా మెట్రో బుకింగ్‌లను పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు. దశల వారీగా 69.2 కిలో మీటర్ల మెట్రో రూట్ ప్రయాణికులకు అందుబాటులోకి ఉంది. తాజాగా మెట్రో రైలు 57 మెట్రో స్టేషన్ లలో మెట్రో రైలు ర్యాపిడూ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో బైక్ మెట్రో రైడ్ లపై ఫ్లాట్ తగ్గింపు ధరలతో ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవచ్చు.
హైదరాబాద్‌లో మహా నగరంలో ప్రజా రవాణాను మెరుగుపరచడంలో ముఖ్యమైన ముందడుగా మెట్రో సేవలు అందిస్తోంది. రాపిడో మరియు ఎల్&టిఎంఆర్ హెచ్ఎల్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయు) జరిగింది.
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం, హైదరాబాద్ నగర జనాభాకు రోజువారీ ప్రయాణాలను సులభతరం చేయడంతో పాటు మెరుగైన మెట్రో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేసోతంది. ప్రతిరోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణీకుల ఆకట్టుకునే సగటు రైడర్‌షిప్‌తో, క్లిష్టమైన మొదటి మరియు చివరి మైలు కనెక్టివిటీ సమస్యలను ర్యాపిడో ద్వారా పరిష్కారం లభించనుంది.
ఈ ఒప్పందం మెట్రో ప్రయాణికులకు సౌకర్యవంతంగా.. ఆర్థిక రవాణా అవకాశాలను అందించడంలో ముందుంటుందని చెప్పుకొచ్చారు. ర్యాపిో బైక్ మెట్రో సేవ కోసం తగ్గింపుతో కూడిన ఫ్లాట్ రేట్లు అందుబాటులోకి రానున్నాయి
హైదరాబాద్ మెట్రో రైల్ మరియు రాపిడో మధ్య ఈ భాగస్వామ్యం హైదరాబాద్‌లో అర్బన్ మొబిలిటీ సౌకర్యాలను పెంపొందించడానికి ఉపయోగపడనుంది. ముఖ్యంగా నగరంలో ప్రయాణికులకు కీలకమైన లైఫ్‌లైన్‌గా మెట్రో రైలు స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.
గత ఏడేళ్లుగా రాపిడో హైదరాబాద్ మొబిలిటీ ల్యాండ్‌స్కేప్‌లో అంతర్భాగంగా మారింది. ఈ భాగస్వామ్యం రాపిడో మరియు హైదరాబాద్ మెట్రో యొక్క భాగస్వామ్య నిబద్ధతతో పట్టణ ప్రయాణాన్ని మెరుగుపరచనుంది.మెట్రో ప్రయాణం వల్ల పర్యావరణ అనుకూల నగరాన్ని నిర్మించడంలో దోహదం చేస్తుందన్నారు.
ప్రస్తుతం మెట్రో కారిడార్ -2 లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా.. చంద్రాయణా గుట్ట టూ ఎయిర్ పోర్ట్ వరకు పనులను త్వరలో మొదలు పెట్టనున్నారు.