నాగ్ చెప్పిన కొత్త కోడలి ముచ్చట్లు

  

Last Updated : Nov 8, 2017, 05:40 PM IST
నాగ్ చెప్పిన కొత్త కోడలి ముచ్చట్లు

టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున తన కొడుకు నాగచైతన్యకు ఇటీవలే పెళ్లి చేసిన విషయం తెలిసిందే. అలాగే తన కోడలిగా వచ్చిన సమంతతో కలిసి ఆయన  ‘రాజుగారి గది 2’ అనే చిత్రంలో కూడా నటించారు. ఆ చిత్రం హిట్ టాక్‌ను కూడా కైవసం చేసుకుంది. అలాగే రామ్ గోపాల్ వర్మతో కలిసి తాను ఓ సినిమా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు నాగ్. ఈ క్రమంలో ఇటీవలే తన ఇంటికి కొత్త కోడలిగా వచ్చిన సమంత గురించి ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు నాగ్. "సమంత, నాగచైతన్యను పెళ్లి చేసుకోవడం వల్ల పెద్దగా జరిగిన మార్పేమీ లేదు. అంతకు ముందే తను నాకు బాగా తెలుసు. పెళ్లికి ముందే మా కుటుంబంతో బాగా కలిసిపోయింది. అయితే ఒక్కటే తేడా.. పెళ్లి కాకముందు నన్ను "సార్"  అని పిలిచే సమంత, పెళ్లయిన తర్వాత "మామయ్యా" అని ఆప్యాయతతో పిలుస్తోంది. రాజుగారి గది 2లో సమంత దెయ్యంగా నటించింది. నేను మెంటలిస్ట్‌గా నటించాను. అయితే షూటింగ్ జరుగుతున్నంత సేపు మేము మా ఇంటిలో జరగబోయే పెళ్లి గురించే ఎక్కువ సేపు మాట్లాడుకొనేవాళ్లం. ఎంతైనా సమంత మా ఇంటికి కోడలిగా రావడం మా అదృష్టం" అని అన్నారు నాగ్. 

Trending News