Vk Naresh: నటుడు నరేష్ ముగ్గురు భార్యలు ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Vk Naresh three wives: గత కొద్ది రోజులుగా నటుడు నరేష్ నాలుగో పెళ్లి వార్తల్లో నిలిస్తున్న క్రమంలో  ఆయన ముగ్గురు భార్యలు ఎవరు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2022, 02:11 PM IST
  • నరేష్ పెళ్లిళ్ళ గురించి ప్రచారం
  • ముగ్గురు భార్యలు ఎవరు అనేదాని మీద ఆసక్తి
  • ఎవరెవరో తెలుసా?
Vk Naresh: నటుడు నరేష్ ముగ్గురు భార్యలు ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Vk Naresh three wives: గత కొద్ది రోజులుగా నటుడు నరేష్ అనూహ్య కారణాలతో వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఆయన మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ తో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఆయన ముగ్గురు భార్యలు ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే విషయం మీద కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన ముగ్గురు భార్యలు ఎవరు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సోషల్ మీడియాలో, మీడియాలో ప్రచారం జరుగుతున్న దాని మేరకు విజయనిర్మల మొదటి భర్త కృష్ణమూర్తితో కలిగిన సంతానం విజయ కృష్ణ నరేష్. అయితే విజయనిర్మల ఆయనను తీసుకుని వచ్చిన తర్వాత కృష్ణతో ఏర్పడిన పరిచయంతో ఆయనను రెండో వివాహం చేసుకున్నారు.

పెరిగి పెద్దవాడైన తర్వాత నరేష్ ను ప్రేమ సంకెళ్లు అనే సినిమాతో హీరోగా పరిచయం చేశారు విజయనిర్మల. ఆ తర్వాత ఆయన కామెడీ హీరోగా అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన యుక్త వయసులో ఉండగానే డాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెను ఇచ్చి విజయనిర్మల వివాహం జరిపించారు. వీరిద్దరికీ నవీన్ కృష్ణ అనే కుమారుడు జన్మించాడు. అయితే ప్రసవం సమయంలో ఆమెకు అనారోగ్యం ఏర్పడడంతో నరేష్ ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి మనవరాలు రేఖ సుప్రియ అనే మహిళను తల్లిదండ్రుల సమ్మతితో నరేష్ వివాహం చేసుకున్నారు. వీరికి కూడా ఒక బాబు జన్మించిన తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 

కానీ చెన్నై కేంద్రంగా నడుస్తున్న ఒక ఎన్జీవో కోసం కలిసి పని చేస్తూ ఉంటారు. కొడుకు ఆలనా పాలనా ప్రస్తుతం నరేష్ చూసుకుంటున్నారు. ఇక ఆ తర్వాత విజయనిర్మల దగ్గర దర్శకత్వ విభాగంలో పని నేర్చుకుంటానని వచ్చిన ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్న కుమార్తె రమ్య రఘుపతితో నరేష్ ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని పెద్దలు దృష్టికి తీసుకు వెళ్లడంతో సుమారు ఇద్దరికీ 20 ఏళ్లకు పైగా వయోభేదం ఉన్నా వివాహం జరిపించారు. 

కానీ వీరి వివాహం జరిగిన తర్వాత ఒక బాబు జన్మించాక రెండేళ్లకే అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు. విడిపోయి కూడా సుమారు ఏడెనిమిదేళ్ళకు పైనే అవుతుంది కానీ నరేష్ ఆమెకు విడాకులు ఇవ్వలేదు. కానీ కుమారుడి ఆలనా పాలనా నిమిత్తం నెలకు 70 వేల రూపాయలు దాకా పంపిస్తున్నట్లు టాక్. కొద్దిరోజుల క్రితం రమ్య కొంతమంది దగ్గర చిన్న మొత్తంలో అప్పులు చేసినట్టు మీడియా ముందుకు రావడంతో ఆమె తమ పేరు చెడగొడుతోంది అనే ఉద్దేశంతో నరేష్ విడాకులు తీసుకోవడం కోసం ఆమెకు విడాకులు నోటీసులు పంపించారు. అప్పటినుంచి పవిత్ర లోకేష్ కు తనకు ఏదో ఉందంటూ రమ్య రఘుపతి అనవసరంగా రాద్ధాంతం సృష్టిస్తుందని నరేష్ చెబుతున్నారు.
Also Read: Major Closing Collections: అడవి శేష్ మేజర్ మూవీ ఎన్ని కోట్లు లాభం సాధించిందో తెలుసా?

Also Read: Samantha Insta account Hack: సమంత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్ వెనుక ఇంత జరిగిందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News