Woman Slits Husband's Throat: ఏపీలో న్యూయర్‌ విషెష్‌ చెప్పలేదని భర్త గొంతు కోసిన భార్య!

Woman Slits Husband's Throat : నూతన సంవత్సరాది సంధర్భంగా ఒక మహిళ తన భర్త గొంగు కోసినట్టుగా ప్రచారం జరుగుతోంది, అది కూడా ఏపీలోని నంద్యాలలో అని తెలుస్తోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 2, 2023, 08:37 PM IST
Woman Slits Husband's Throat: ఏపీలో న్యూయర్‌ విషెష్‌ చెప్పలేదని భర్త గొంతు కోసిన భార్య!

Woman Slits Husband's Throat for Not Wishing Her on New Year Eve: కొన్ని వార్తలు వినడానికి చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి, ఇప్పుడు మీరు చదవబోయేది కూడా అలాంటిదే. భార్యాభర్తల మధ్య ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూ ఉండటం సహజమే, కొందరి మధ్య మాత్రం ఇది కాస్త వింత పోకడలకు దారితీస్తూ ఉంటుంది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాలకు చెందిన ఒక మహిళ తన భర్త తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పలేదని గొంతు కోసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే దీనికి సంబంధించి రెండు ప్రచారాలు తెర మీదకు వస్తున్నా అసలు ఏం జరిగిందనే విషయం మీద మాత్రం పూర్తి క్లారిటీ లేదు. అసలు విషయం ఏమిటంటే నంద్యాల గోస్పాడు మండలం కానాలపల్లికి చెందిన లక్ష్మీదేవి, బ్రహ్మయ్య భార్యాభర్తలు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. భార్య మీద అనుమానం ఉండడంతో బ్రహ్మయ్య తరచుగా కొడుతూ ఉండేవాడు.

ఈ నేపథ్యంలోనే వారం క్రితం కూడా ఆమె మీద దాడి చేయడంతో ఆ దాడిలో లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు నంద్యాల పెద్ద ఆస్పత్రిలో చేర్చారు. కొద్ది రోజుల నుంచి లక్ష్మీదేవి ఆ హాస్పిటల్లోనే చికిత్స పొందుతోంది. ఆదివారం నాడు బ్రహ్మయ్య భార్యను చూసేందుకు ఆసుపత్రికి వెళ్ళాడు. ఈ సమయంలోనే ఆసుపత్రికి వచ్చిన భర్త తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పకపోవడంతో లక్ష్మీదేవి అతను మీద దాడి చేసిందని దగ్గర్లో ఉన్న పదునైన వస్తువుతో అతని గొంతు కోసింది అని ప్రచారం జరుగుతోంది.

అయితే దీనికి సంబంధించి మరో ప్రచారం ఏమిటంటే తనమీద మళ్లీ దాడి చేయడానికి వస్తున్నాడని భావించి దగ్గరకు వచ్చిన భర్తపై కత్తితో దాడి చేసిందని దీంతో అతని గొంతు తెగిపోయిందని అంటున్నారు.  అక్కడే ఉన్న సెక్యూరిటీ కార్డు ఇది గమనించి ఆమె చేతిలో నుంచి కత్తి లాక్కున్నాడని డాక్టర్లు గాయపడ్డ బ్రహ్మయ్యకి వెంటనే చికిత్స అందించగా పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ఆసుపత్రికి రిఫర్ చేశారని చెబుతున్నారు. అయితే ఇందులో ఏం జరిగిందనే విషయం మీద మాత్రం పూర్తిగా రావాల్సి ఉంది.

Also Read: Bairi Naresh Remand Report: బైరి నరేష్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. కుట్రపూరితంగానే అయ్యప్పపై వ్యాఖ్యలు!

Also Read: Myron Mohit Remand Report: హీరోయిన్ భర్త రిమాండ్ రిపోర్టులో సంచలనం.. షారుఖ ఖాన్ కొడుకు కేసులో కూడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News