Kerala Court: కేరళలోని పోక్సో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష విధించింది. ఏకంగా 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అమలు చేయాలని ఆదేశించింది. దీంతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించారు. జరిమానా కట్టకపోతే అదనంగా మరో మూడేళ్లపాటు జైలు శిక్ష అమలు చేయాలని న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది.
కేరళలోని తిరువల్లలో ఈఘటన జరిగింది. స్థానికంగా నివసించే ఆనందన్ పీఆర్ అలియాస్ బాబు అనే 41 ఏళ్ల వ్యక్తి ..ఓ పదేళ్ల బాలికపై రెండేళ్లుగా లైంగిక వేధించాడు. 2019-21 కాలంలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు బాబు అతి సమీప బంధువు. వారి ఇంట్లోనే ఉంటూ మంచివాడిలా నటిస్తూ పలుమార్లు లైంగిక దాడికి దిగాడు. దీనిని బాధితురాలు..ఇంట్లోని వారికి చెప్పలేని పరిస్థితి.
ఇదే అదునుగా పలుమార్లు దారుణానికి పాల్పడ్డాడు. ఐతే చివరి నిమిషాల్లో అసలు బయటపడింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి ..రిమాండ్‌కు తరలించారు. అతడ్ని పతనంతిట్ట కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు..కీలక తీర్పు వెలువరించింది. ఈఘటనలో అప్పట్లో పెను సంచలనంగా మారింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్‌లు వచ్చాయి.
ఇటీవల అమీన్‌పూర్ అనాధ ఆశ్రమం రేప్ కేసులో నిందితులకు సంగారెడ్డి ఫోక్సో ఫాస్ట్రాక్ కోర్టు ఇలాంటి తీర్పునే ఇచ్చింది. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. హోంలో ఓ బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు రుజువైంది. దీంతో వారికి కోర్టు కఠిన శిక్షను విధించింది. దీనిపై హైపవర్ కమిటీ సైతం విచారణ జరిపింది. పోస్ట్ మార్టం నివేదికలో అత్యాచారం, హత్య చేసినట్లు తేలింది.
Also read:Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతల మధ్యే పోటీ..సోనియా మద్దతు ఎవరికీ..!
Also read:IPL: టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కంటే..ఐపీఎల్‌లో ఇచ్చే డబ్బే ఎక్కువనా..అదేంటి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి