Marriage Turns To Tragedy: తాళి కట్టి వారం కాకముందే.. ఎస్సైతో సహా నవ వరుడు దుర్మరణం

Tragedy Accident: పెళ్లయి వారం కూడా కాలేదు. అంతలోనే జరిగిన ప్రమాదంలో వరుడు కన్నుమూశాడు. వరుడితోపాటు ఓ ఎస్సైతో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 21, 2024, 08:54 PM IST
Marriage Turns To Tragedy: తాళి కట్టి వారం కాకముందే.. ఎస్సైతో సహా నవ వరుడు దుర్మరణం

Newly Married Groom Died: ఇటీవల అంగరంగ వైభవంగా వివాహం జరగా.. తాజాగా వివాహ రిసెప్షన్‌ ముగిసింది. సొంత గ్రామానికి తిరుగు ప్రయాణం కాగా అంతలోనే ఘోరం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో నవ వరుడు మృతి చెందాడు. అతడితో ఎస్సై, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలై కన్నుమూశారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకోగా మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నిండింది.

Also Read: Movie Chance Fraud: సినిమా ఛాన్స్‌ల పేరిట తన 'కోరికలు' తీర్చుకుని మోసం చేసిన నటుడు

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం అన్నసాగర్‌ వద్ద జాతీయ రహదారి-44పై బుధవారం మధ్యాహ్నం ఓ కారు అకస్మాత్తుగా చెట్టును ఢీకొట్టింది. హైదరాబాద్‌ నుంచి అనంతపురం వెళ్తుండగా కారు ప్రమాదానికి గురయ్యింది. ప్రమాదంలో ఎస్సై సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఎస్సై వెంకటరమణ, ఆయన అల్లుడు పవన్‌ సాయి, డ్రైవర్‌ చంద్రగా గుర్తించారు. ఎస్సై వెంకటరమణ కుమార్తె అనూషకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే నవ వధువును మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది.

Also Read: TS High Court: పోలీసులకు 'క్లాస్‌' తీసుకోవాలి.. డీజీపీకి తెలంగాణ హైకోర్టు సూచన

ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్సైగా వెంకటరమణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వెంకటరమణ తన కుమార్తె అనూషను హైదరాబాద్‌కు చెందిన పవన్‌ సాయి (25)కు ఇచ్చి ఫిబ్రవరి 15వ తేదీన ఘనంగా వివాహం జరిపించారు. వివాహం అనంతరం బంధుమిత్రులంతా కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌లో పవన్‌ సాయి నివాసంలో వివాహ విందు నిర్వహించారు. కార్యక్రమం అనంతరం వెంకటరమణ తన అల్లుడు పవన్‌ సాయి, కుమార్తె అనూషతోపాటు డ్రైవర్‌ చంద్రను తీసుకుని అనంతపురం బయల్దేరారు. బుధవారం ఉదయం బయల్దేరిన వారి కారు మధ్యాహ్నం అన్నసాగర్‌ వద్దకు చేరుకోగానే కారు అదుపు తప్పింది. చెట్టును బలంగా ఢీకొట్టడంతో కారులోని వెంకటరమణ, అల్లుడు పవన్‌సాయి, డ్రైవర్‌ చంద్ర తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. నవ వధువు అనూష మాత్రం తీవ్ర గాయాలతో బయటపడింది. 

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన అనూషను మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం ఏర్పడింది. హైదరాబాద్‌లోని పవన్‌ సాయి కుటుంబంలో, అనంతపురంలోని వెంకటరమణ కుటుంబం ప్రమాద వార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యింది. పెళ్లితో సందడిగా ఉన్న ఆ ఇరు కుటుంబాలు ఈ దుర్ఘటనతో తీరని శోకసంద్రంలో మునిగాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News