Cinematic Crime Scene: తమ వ్యక్తిగత జీవితంలోనే కాదు నేర ప్రవృత్తిలోనూ వారి ఈడుజోడు చక్కగా ఉంది. తమ వ్యక్తిగత జీవితంలో కలిసి ఉంటున్న వారు నేర జీవితంలోనూ ఎంచక్కా ఉంటున్నారు. భార్యాభర్తలు సంసారాన్ని సవ్యంగా చేస్తూనే నేరాలను కూడా అదే రీతిలో కలిసికట్టుగా చేస్తున్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ నేరాలకు పాల్పడుతున్న భార్యాభర్తలు తాజాగా ఓ వృద్ధురాలిని దోచుకున్నారు. బర్త్ డే ఉందని పిలిచి ఆమెను కట్టేసి నగలతో ఉడాయించిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
Also Read: Viral Video: పిల్ల పామును పాప్‌కార్న్‌లా తినేసిన భారీ కట్ల పాము
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామంలో శివ్వ రాములమ్మ నివసిస్తోంది. ఆమె తనకు ఉన్న ఇంటిని భార్యాభర్తలకు ఇటీవల అద్దెకు ఇచ్చింది. వాళ్లు వచ్చి పది రోజులు కూడా కాలేదు. పేదవాళ్లు కావడంతో రాములమ్మనే వారికి వంట సామగ్రి కూడా వాడుకోమని ఇచ్చింది. అయితే భార్యాభర్తలు సోమవారం రాత్రి అదును చూసుకున్నారు. తమ ఇంట్లో బర్త్ డే పార్టీ ఉందని రాములమ్మను దంపతులు పిలిచారు.
Also Read: NTR Emotional: పోలీస్ లాఠీచార్జ్‌పై ఎన్టీఆర్ భావోద్వేగం.. ఫ్యాన్స్ కాలరేగరేసేలా చేస్తా
అద్దెకు ఉన్నవాళ్లే అని పిలవడంతో రాములమ్మ రాత్రి వెళ్లింది. ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. రాములమ్మ ఇంట్లోకి రాగానే కాళ్లు చేతులు కట్టేశారు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. అనంతరం రాములమ్మ శరీరంపై ఉన్న 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు తీసుకుని పారిపోయారు. కొద్దిసేపటికి ఎలాగోలా వృద్దురాలు నోట్లోని గుడ్డలు తీసుకోని అరుపులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూశారు.
ఆమె కట్టేసి ఉండడంతో వెంటనే స్థానికులు కట్లు విప్పారు. అనంతరం జరిగిన మోసాన్ని వారికి చెప్పి రాములమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. గాయలవడంతో ఆమెను ములుగులోని ఆర్‌వీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనానికి పాల్పడ్డ దుండగుల కోసం పోలీసులు సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు. కాగా దంపతుల వివరాలు తెలియవని రాములమ్మ చెబుతోంది.
కుత్బుల్లాపూర్‌లో మహిళ హత్య
దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధి మల్లంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శారద(50) అనే మహిళ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి హత్య చేసిన అనంతరం దుండగులు ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.