UPI Payment: ఇక నుంచి ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్, ఎలాగంటే

UPI Payment: ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ లావాదేవీలే నడుస్తున్నాయి. కానీ ఇంటర్నెట్ లేకుండా సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు యూపీఐ నుంచి కొత్త ఫీచర్ అందుబాటులో వచ్చింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2022, 09:57 PM IST
UPI Payment: ఇక నుంచి ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్, ఎలాగంటే

ఇక నుంచి ఇంటర్నెట్ లేని ప్రాంతంలో చిక్కుకున్నప్పుడు, అత్యవసరంగా డబ్బులు కావల్సినా లేదా బదిలీ చేయాల్సి వస్తే ఇబ్బందే కదా. ఈ సమస్యకు యూపీఐ ఇప్పుడు చెక్ పెడుతోంది.

యూపీఐ విధానం అమల్లో వచ్చిన తరువాత నగదు ఉంచుకోవడమనేది దాదాపుగా తగ్గిపోయింది. జేబుల్లో డబ్బుల్లేకుండా మార్కెట్‌కు వెళ్లిపోతుంటారు. తీరా మార్కెట్‌కు వెళ్లిన తరువాత మొబైల్‌లో ఇంటర్నెట్ రాకపోయినా..నెట్ ప్యాకేజ్ పూర్తయిపోయినా కష్టమౌతుంటుంది. కనీసం మొబైల్ రీఛార్జ్ చేసేందుకైనా నెట్ కావల్సిందే. ఇప్పుడిక ఈ సమస్యను ఎదుర్కోవల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూపీఐ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ప్రకారం యూపీఐ సులభంగా యూపీఐ చెల్లింపు జరపవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఆ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడమే. లేకపోతే ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. 

యూపీఐ లైట్ వినియోగం

ఈ యాప్ ఒక వాలెట్‌లా పనిచేస్తుంది. ఇది వినియోగించేందుకు ఈ వాలెట్‌లో మీ బ్యాంకు ఎక్కౌంట్ నుంచి కొద్దిగా డబ్బులు వేయాల్సి ఉంటుంది. ఇది ఆన్ డివైస్ వ్యాలెట్. అందుకే రియల్ టైమ్ పేమెంట్ చేసేందుకు ఇంటర్నెట్ అవసరముండదు. అంతేకాదు..యూపీఐ పిన్ అవసరం కూడా ఉండదు. అంటే ఆఫ్‌లైన్ మోడ్‌లో లావాదేవీలు జరపవచ్చు.

ఎంత మొత్తం బదిలీ చేయవచ్చు

ఈ యాప్‌ను మీరు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్‌లో కొనుగోళ్లకు వెళ్లినప్పుడు పేమెంట్ చేసేటప్పుడు ఇబ్బంది తలెత్తుతుంది. ఈ యాప్‌తో 200 రూపాయల వరకూ పేమెంట్ చేయవచ్చు. ఈ వ్యాలెట్‌లో 2000 వరకూ బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు. ఎన్నిసార్లైనా వినియోగించుకోవచ్చు. చాలా బ్యాంకులు ఇప్పుడు యూపీఐ లైట్‌ను అనుమతిస్తున్నాయి.

ఎలా వినియోగించాలి

వాలెట్‌లో పేమెంట్ యాడ్ చేసేందుకు ఇంటర్నెట్ అవసరమౌతుంది. బ్యాలెన్స్ యాడ్ చేసిన తరువాత మీరు ఆఫ్‌లైన్ పేమెంట్ చేయవచ్చు. ఇందులో యూపీఐ ఆటో పే కూడా వినియోగించవచ్చు. దీంతో ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ యాడ్ అవుతుంది. 

Also read: Rakesh Jhunjhunwala Tips: షేర్ మార్కెట్‌లో రాణించేందుకు ఝున్‌ఝున్‌వాలా చెప్పిన సూచనలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News