SBI loan Interest Rates: SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్..లోన్ తీసుకున్న వారికి EMI భారం మరింత పెరిగే చాన్స్..!

SBI తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ భారం మరింత  పెరిగే అవకాశం ఉంది. తాజాగా ఎస్బీఐ  MCLR ఆధారిత వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. ఈఎంఐ భారం ఎంత శాతం పెరిగే ఛాన్స్ ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Written by - Bhoomi | Last Updated : Jul 18, 2024, 02:34 PM IST
SBI loan Interest Rates: SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్..లోన్ తీసుకున్న వారికి  EMI భారం మరింత పెరిగే చాన్స్..!

loan Interest Rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి  లోన్ తీసుకున్న వారి జేబుపై భారం పెరగనుంది. తాజాగా ఎస్బీఐ  MCLR ఆధారిత వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. ఈ పెంపుదలతో  గృహ రుణం నుండి వాహన రుణం వరకు SBI స్పాన్సర్ చేస్తున్న అన్ని రకాల లోన్స్ పై వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో ఇవి మునుపటి కంటే భారంగా మారిపోయాయి. బ్యాంక్ వివిధ కాలాల రుణాల వడ్డీ రేటులో ఈ పెరుగుదల 5 బేసిస్ పాయింట్ల నుండి 10 బేసిస్ పాయింట్లకు పెంచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, ఈ వడ్డీ రేట్ల పెంపు సోమవారం, జూలై 15, 2024 నుండి అమలులోకి వచ్చింది. అంతకుముందు జూన్‌లో కూడా ఎస్‌బీఐ తన రుణాలపై విధించే వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. 

SBI రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే:

SBI ఒక నెల MCLR బెంచ్‌మార్క్ ఆధారంగా వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచి 8.35 శాతానికి, 3 నెలల MCLR బెంచ్‌మార్క్ ఆధారంగా వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచి 8.40 శాతానికి చేర్చింది. ఇది కాకుండా, 6 నెలలు, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలకు MCLR ఆధారంగా వడ్డీ రేట్లు కూడా ఒక్కొక్కటి 10 బేసిస్ పాయింట్లు పెంచారు. దీంతో 6 నెలలకు MCLR ఆధారిత వడ్డీ రేటు 8.75 శాతం, ఒక సంవత్సరానికి 8.85 శాతం, 2 సంవత్సరాలకు 8.95 శాతంగా మారింది. అదే సమయంలో, 3 సంవత్సరాల MCLR ఆధారంగా వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్లు పెరిగి 9 శాతానికి చేరుకుంది. 

Also Read: Flipkart Mobile Offers: మిస్ అవద్దు, ఫ్లిప్ కార్ట్ లో బ్రాండ్ ఫోన్లపై భారీ తగ్గింపు

MCLR అంటే ఏమిటి? 

MCLR అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. ఇది బ్యాంకు ఇచ్చే రుణంపై విధించే వడ్డీ రేటును వివిధ బ్యాంకు కార్యకలాపాలకు అయ్యే ఖర్చుతో లింకు అయి ఉంటుంది. సాధారణంగా ఆర్బీఐ నుంచి బ్యాంకులు రుణాలను పొందుతాయి. అవి పొందే వడ్డీరేటు ఆధారంగా కస్టమర్లకు బ్యాంకులు తమ లాభం చూసుకొని రుణాలను అందిస్తాయి. ఈ వడ్డీ రేటు బ్యాంకు నిధుల సమీకరణ ఖర్చు ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే MCLR ఆధారితంగా ఉండటం వల్ల బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు బ్యాంకు నిధుల వ్యయానికి అనుగుణంగా పెరుగుతుంటాయి.  

స్టేట్ బ్యాంక్ EBLR ఆధారిత రేట్లలో మార్పు లేదు :

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన MCLR ఆధారిత రుణ రేట్లను పెంచింది. కానీ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR) ఆధారంగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ రేట్లు ఇప్పటికీ 9.15 శాతంగానే ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చాలా గృహ రుణాలు EBLRతో అనుసంధానంతో ఉంటాయి. SBI గృహ రుణ వడ్డీ రేట్లు 8.50 శాతం నుండి 9.65 శాతం మధ్య ఉన్నాయి. CIBIL స్కోర్‌ను దృష్టిలో ఉంచుకుని, ఏ కస్టమర్‌కు ఏ వడ్డీ రేటుకు రుణం ఇవ్వాలనే నిర్ణయం బ్యాంకు తీసుకుంటుంది. 

ఆర్‌బీఐ చాలా కాలంగా వడ్డీ రేట్లను మార్చడం లేదు: 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన పాలసీ వడ్డీ రేటును అంటే రెపో రేటును చాలా కాలంగా తగ్గించడం లేదు. దీని వల్ల రుణం తీసుకునే వారిపై వడ్డీ రేట్ల భారం అలాగే కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ తన చివరి మానిటరీ  సమీక్షా సమావేశంలో కూడా రెపో రేటును 6.50 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో వడ్డీ రేట్లను మార్చకుండా నిర్ణయించుకుంది.  దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ రుణాలపై MCLR పెంచడంతో ఈఎంఐ మరింత భారంగా మారి రుణం తీసుకునే వారి ఇబ్బందులను పెంచింది.

Also Read: Amrit Vrishti: SBI నుంచి బంపర్ స్కీం.. 5 లక్షల డిపాజిట్‌పై ఎంత రాబడి వస్తుందంటే.!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News